Breaking News

US Election 2024 నాన్సీ పెలోసీ వరుసగా 20వ సారి గెలుపు, ఇంట్రస్టింగ్‌ ఫ్యాక్ట్స్‌

Published on Wed, 11/06/2024 - 16:27

అమెరికా అధ్యక్ష ఎ‍న్నికల్లో ఒక విశేషం చోటు చేసుకుంది. 2024 అమెరికా ఎన్నికల ఫలితాలతో  కాలిఫోర్నియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న డెమోక్రటిక్ ప్రతినిధి నాన్సీ పెలోసి యుఎస్ హౌస్ స్థానానికి తిరిగి ఎన్నికయ్యారు.   దీంతో ఈ స్థానం నుంచి వరుసగా 20 సార్లు గెలుపొందిన మహిళగా ఖ్యాతి దక్కించుకున్నారు.   

అంతేకాదు హౌస్ స్పీకర్‌గా ఎన్నికైన తొలి మహిళ  కూడా నాన్సీ పెలోసి రికార్డు సృష్టించిన ఘనత కూడా ఆమె సొంతం. 1987లో తొలిసారిగా కాలిఫోర్నియాలో జరిగిన ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు.  2003 నుండి హౌస్ డెమొక్రాట్‌లకు నాయకత్వం వహించారు. హౌస్ ఆఫ్ కాంగ్రెస్‌లో ప్రధాన పార్టీకి నాయకత్వం వహించిన తొలి మహిళ. 2007- 2011 వరకు,  తిరిగి 2019- 2023 వరకు హౌస్‌ స్పీకర్‌గా వ్యవహరించారు. 

ఎక్కువ కాలం పనిచేసిన హౌస్ డెమోక్రాటిక్ నాయకురాలు పెలోసి. అలాగే చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన హౌస్ స్పీకర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు.  

ఎఫర్డబుల్‌ కేర్‌ రక్షణ చట్టంతో సహా కొన్ని కీలకమైన చట్టాలను ఆమోదించడంలో పెలోసి కీలక పాత్ర పోషించారు.  అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై అభిశంసన లాంటి ఇతర ముఖ్యమైన సందర్భాలలో పార్టీలో ఆమె పాత్ర కీలకం.

రాజకీయ వారసత్వం: రాజకీయంగా చురుకైన కుటుంబం నుండి  వచ్చారు. నాన్సీ పెలోసి బాల్టిమోర్‌లో జన్మించారు. ఆమె తండ్రి  రాజకీయ మేత్త మేయర్ , కాంగ్రెస్ సభ్యుడు థామస్ డి'అలెసాండ్రో జూనియర్.  వాషింగ్టన్ ట్రినిటీ కళాశాల నుండి నాన్సీ 1962లో  డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. వ్యాపారవేత్త పాల్ పెలోసిని వివాహం చేసున్నారు.

 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)