Breaking News

తీరానికి కొట్టుకొచ్చిన వింత మెటల్ షీట్లు

Published on Wed, 12/27/2023 - 09:00

న్యూయార్క్: అమెరికా తూర్పు తీరానికి వింత మెటల్ షీట్లు కొట్టుకువచ్చాయి. మెటల్ షీట్లకు ఫైబర్ ఊడిపోయి ఉంది. కూర్చోవడానికి వీలుగా ఉన్న ఈ మెటల్‌ షీట్లను మొదట యాక్టర్ మాథ్యూ జాకబ్ పెర్రీ గుర్తించాడు. న్యూజెర్సీలోని మార్గేట్‌లోని బీచ్ వెంబడి నడుచుకుంటూ వెళుతుండగా కనుగొన్నాడు. వింతగా ఉన్న ఈ ఉనుపషీట్లను వీడియో తీసి టిక్‌టాక్‌ వీడియోలో పోస్టు చేశాడు. ఇది కాస్త వైరల్‌గా మారింది. మెటల్ షీట్లపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

''అవి ఏమిటో నాకు ఖచ్చితంగా తెలియలేదు. నేను మొదట చెట్టు కొమ్మ అనుకున్నాను. దగ్గరికొచ్చేసరికి మెటల్ షీట్లని అర్థమైంది. దగ్గరకు వచ్చేసరికి అవి విమానం సీట్లలాగే కనిపించాయి'' అని నటుడు జాకబ్ పీపుల్ మ్యాగజైన్‌తో అన్నారు.  

జాకబ్ పోస్టు చేసిన వీడియోలో తుప్పు పట్టిన మెటల్ షీట్లు ఇప్పటికీ స్ప్రింగ్‌లను కలిగి ఉన్నాయి. అప్పటికే ఫాబ్రిక్ ఊడిపోయింది. కొన్ని సీట్లు వాటి మధ్య మెటల్ హ్యాండ్‌రైల్‌ను కలిగి ఉన్నాయి. అవి విమానంలో ఉన్నట్లే ఉన్నాయి. ఈ వింత ఆకారాలపై సోషల్ మీడియోలో నెటిజన్లు విశేషంగా స్పందించారు.

జూలై 17, 1996న అట్లాంటిక్ మహాసముద్రంలో కూలిపోయిన టీడబ్ల్యూఏ విమానం 800 శిథిలాల నుంచి సీట్లు వచ్చి ఉండవచ్చని చాలా మంది అభిప్రాయపడ్డారు. TZB 900 విమానం అని మరో నెటిజన్ అన్నారు. అసలు అవి విమానం సీట్లు కానేకావని తాను ఎయిర్‌క్రాఫ్ట్ మెకానిక్‌ని అని మరో నెటిజన్ పేర్కొన్నాడు.  

ఇదీ చదవండి: ఆర్కియాలజిస్టులకు అప్పగించిన ఆర్మీ
 

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)