Breaking News

వారి ‘నిప్పు కోడి పాదాల’ రహస్యం ఏమిటి? ఈ తెగ ఎక్కడుంది?

Published on Tue, 09/26/2023 - 07:20

ఈ ప్రపంచం మన ఊహకందేటంతటి చిన్నదేమీ కాదు. ఇక్కడ వివిధ రకాల ప్రజలు నివసిస్తున్నారు. వీరిమధ్య మనకు తెలియని వింతలు ఎన్నో దాగివున్నాయి. ప్రపంచంలోని భిన్న సంస్కృతిని ఒకేచోట కూర్చుంటే అర్థం చేసుకోలేమని చాలామంది చెబుతుంటారు. ప్రపంచంలోని ఒక వింత తెగ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

ఆ తెగకు ఉన్నది ఒక ప్రత్యేకతనో లేదా లోపమో.. ఏదో ఒకటి అనుకోవచ్చు. ఆ తెగ మొత్తం  ఈ వింత సమస్యను ఎదుర్కొంటోంది. వారి రూపురేఖలు మనుషులను పోలి ఉంటాయి. కానీ వారి పాదాలను చూడగానే ఎవరికైనా దిమ్మతిరిగిపోతుంది. వీరి పాదాల తీరు మన పాదాల మాదిరిగా 5 వేళ్లతో ఉండదు. వారికి కేవలం  2 వేళ్లు మాత్రమే ఉంటాయి. ఇది ఎవరినైనా ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

డైలీ స్టార్ తెలిపిన వివరాల ప్రకారం డొమా తెగగా పేరొందిన ఈ తెగ ప్రజలను వడోమా లేదా బంట్వానా తెగ అని కూడా పిలుస్తారు. వారి కాళ్లు ఆస్ట్రిచ్‌( నిప్పు కోడి లేదా ఉష్ట్రపక్షి) కాళ్ల మాదిరిగా ఉంటాయి. అందుకే వారిని ఆస్ట్రిచ్ ప్రజలు అని కూడా పిలుస్తారు. ఈ తెగ జింబాబ్వేలోని కన్యెంబా ప్రాంతంలో కనిపిస్తుంది. ఈ కమ్యూనిటీ అరుదైన జన్యుపరమైన రుగ్మతను ఎదుర్కొంటోంది. వీరు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యను ఎక్ట్రోడాక్టిలీ అని అంటారు. ఈ పరిస్థితి కారణంగా వారి పాదాలకు 5 వేళ్లకు బదులుగా 2 వేళ్లు మాత్రమే ఉంటాయి.

ఈ  తెగకు చెందిన జనాభాలో ప్రతి నాల్గవ వ్యక్తి ఇటువంటి సమస్యను ఎదుర్కొంటున్నారు. ఫలితంగా ఈ తెగకు చెందిన వారు ఇతర వర్గాలలోని వారిని వివాహం చేసుకోలేని పరిస్థితి ఉంది. వారు ఇతర వర్గాలలోనివారిని వివాహం  చేసుకోవడంపై చట్టరీత్యా నిషేధం అమలులో ఉంది. ఈ తరహా వ్యక్తులు సరిగా నడవలేరు. బూట్లు ధరించలేరు. కేవలం చెట్లు ఎక్కే విషయంలో మాత్రం చురుకుగా ఉంటారు. 
ఇది కూడా చదవండి: ఆమె రూ. 6 లక్షలుపెట్టి బొమ్మలను ఎందుకు కొంది? డైపర్లు ఎందుకు మారుస్తుంది?

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)