Breaking News

Myanmar: ఇంకా తప్పని ముప్పు.. 24 గంటల్లో 15 భూ ప్రకంపనలు

Published on Sun, 03/30/2025 - 09:36

నేపిడా: శుక్రవారం సంభవించిన భారీ భూకంపం మయన్మార్‌(Myanmar)ను అతలాకుతలం చేసింది. నాటి భయం నుంచి అక్కడి ‍ప్రజలు కోలుకోకముందే తిరిగి పలుమార్లు భూ ప్రకంపనలు సంభవించాయి. గడచిన 24 గంటల్లో మయన్మార్‌లో 15 సార్లు భూమి కంపించింది. దీంతో మయన్మార్‌కు ఇంకా భూ ప్రకంపనల ముప్పు తప్పలేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.

గడచిన 24 గంటల్లో ప్రతి రెండు గంటలకు ఒకసారి  భూమి కంపించడాన్ని శాస్త్రవేత్తలు(Scientists) గుర్తించారు. భూకంపం తర్వాత మయన్మార్‌లో ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. దీంతో అక్కడి విషాదానికి సంబంధించిన పలు చిత్రాలు, వీడియోలు అందుబాటులోకి రావడం లేదు.  భూకంపం తీవ్రతకు పలు భవనాలు, వంతెనలు కూలిపోయాయి. మయన్మార్‌లోని చారిత్రక అవా వంతెన కూడా భూకంపం తీవ్రతకు కూలిపోయింది. ఈ వంతెనను 1934లో నిర్మించారు.

ఇదేవిధంగా మయన్మార్‌లోని  ప్రముఖ పగోడా ఆలయం కూడా కూలిపోయింది. ఈ ఆలయం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితా(UNESCO World Heritage List)లో చోటు దక్కించుకుంది. ఈ ఆలయ నిర్మాణశైలి ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఏడాది పొడవునా  భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఇప్పుడు ఈ ఆలయం శిథిలమయ్యింది. మయన్మార్‌లో ఇప్పటికీ అంతర్యుద్ధం కొనసాగుతోంది. అటువంటి పరిస్థితిలో తాజాగా సంభవించిన భూకంపం మయన్మార్‌కు దెబ్బ మీద దెబ్బలా తయారయ్యింది.  ఈ నేపధ్యంలో భారత్‌.. మయన్మార్‌కు అండగా నిలిచింది. బాధితులకు సహాయ సామాగ్రిని అందించేందుకు ఆపరేషన్ బ్రహ్మను ప్రారంభించింది.

ఇది కూడా చదవండి: చైత్ర నవరాత్రుల సందడి ప్రారంభం

Videos

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

Photos

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!