Breaking News

మొజాంబిక్‌లో జైల్‌ బ్రేక్‌

Published on Fri, 12/27/2024 - 06:00

మపుటో: మొజాంబిక్‌లో ఎన్నికల అనంతర హింస చల్లారడం లేదు. రాజధాని మపుటో శివార్లలోని అత్యంత కట్టుదిట్టమైన భద్రతతో కూడిన సెంట్రల్‌ జైల్లో బుధవారం అల్లర్లు చెలరేగాయి. పోలీసు సిబ్బంది నుంచి కొందరు ఖైదీలు ఆయుధాలు లాక్కుని తోటివారిని విడిపించడం మొదలు పెట్టారు. అల్లర్లు, తిరుగుబాటును అణిచేందుకు భద్రతా దళాలు వెంటనే రంగంలోకి దిగారు. ఇరు వర్గాల మధ్య ఘర్షణలో 33 మంది మృతి చెందారు.

 15 మందికి పైగా గాయపడ్డట్టు ప్రాథమిక సమాచారం. ఆ క్రమంలో జైలు గోడ కూలిపోవడంతో ఏకంగా 6,000 మందికి పైగా జైలు నుంచి తప్పించుకున్నట్టు దేశ పోలీసు జనరల్‌ కమాండర్‌ బెర్నార్డినో రఫెల్‌ తెలిపారు. వారిలో 150 మందిని పట్టుకున్నామన్నారు. ‘‘నేరారోపణలు రుజువైన 29 మంది కరడుగట్టిన ఉగ్రవాదులను కూడా ఖైదీలు విడిపించుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. మరో రెండు జైళ్లలోనూ ఇలాంటి ప్రయత్నాలు జరిగాయి’’అని వివరించారు. ఖైదీలు జైలు నుంచి పారిపోతున్న వీడియోలు వైరల్‌గా మారాయి. 

అధికార పార్టీకి వ్యతిరేకంగా 
గత అక్టోబర్లో జరిగిన ఎన్నికల్లో దీర్ఘకాలంగా అధికారంలో ఉన్న ఫ్రెలిమో పార్టీ విజయం సాధించింది. ఫలితాలను నిరసిస్తూ అప్పట్నుంచే దేశమంతటా ఆందోళనలు జరుగుతున్నాయి. అధికార పార్టీ విజయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం ధ్రువీకరించింది. దాంతో ఒక్కసారిగా అల్లర్లు తీవ్రతరమయ్యాయి. వాటిలో ఒక్క రోజే కనీసం 21 మంది మరణించినట్టు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.

Videos

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)