Breaking News

పర్వతారోహకుడు పుర్జా దుర్మరణం 

Published on Sun, 08/02/2026 - 05:51

కాఠ్మండు: పర్వతారోహణలో అనితర సాధ్యమైన రికార్డ్‌లను బద్దలుకొట్టి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లో మరో పర్వతాన్ని అధిరోహించేందుకు ప్రయత్నించిన 43 ఏళ్ల ప్రఖ్యాత బ్రిటన్‌– నేపాలీ పర్వతారోహకుడు నిర్మల్‌ పుర్జా గురువారం జరిగిన హిమపాతం ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. పుర్జాతో కూడిన పది మంది పర్వతారోహకుల బృందం బ్రాడ్‌పీక్‌ను అధిరోహిస్తూ హిమపాతంలో చిక్కుకున్న విషయం తెల్సిందే. శుక్రవారం నాటికే నలుగురికి మృతదేహాలను వెలికితీయగా తాజాగా మృతుల్లో పుర్జా ఉన్నట్లు స్థానిక యంత్రాంగం శనివారం ధృవీకరించింది. 

రికార్డులను అధిరోహించాడు.. 
ఏడేళ్ల క్రితం కేవలం ఆరు నెలల వ్యవధిలో 8వేల మీటర్లకంటే ఎత్తయిన 14 పర్వతాలను అవలీలగా అధిరోహించి ఆనాడు పుర్జా సరికొత్త ప్రపంచ రికార్డ్‌ నెలకొల్పారు. 2021 జనవరిలో భయంకరమైన చలిలోనూ కె2 పర్వతాన్ని పుర్జా అధిరోహించారు. నాలుగేళ్ల క్రితం కూడా ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన తొలి మూడు(ఎవరెస్ట్, కె2, కాంచనగంగ)లను వేగంగా అధిరోహించి సరికొత్త గిన్నిస్‌ ప్రపంచ రికార్డ్‌ను నెలకొల్పారు. ఈ ఫీట్‌ను ఆయన కేవలం 76 రోజుల్లో పూర్తిచేయడం విశేషం. తండ్రి, సోదరుల్లా తానూ బ్రిటిష్‌ సైన్యంలో పనిచేయాలని టీనేజీలో భావించారు. కష్టపడి బ్రిటన్‌ సైన్యంలో చేరి ఆరేళ్లు గూర్ఖాగా, పదేళ్లు యూకే స్పెషన్‌ ఫోర్సెస్‌లో పనిచేశారు. 
 

Videos

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)