Breaking News

30 లక్షల కుక్కల హతం!

Published on Mon, 01/20/2025 - 06:13

2030 ఫిఫా వరల్డ్‌ కప్‌కు స్పెయిన్, పోర్చుగల్‌తో కలిసి ఆతిథ్యం ఇవ్వనున్న మొరాకో ఆ లోపు దేశంలో వీధికుక్కల బెడదను వదిలించుకోవాలని ప్రయత్నిస్తోంది. అందుకోసం ఏకంగా 30 లక్షల కుక్కలను చంపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం! విషం పెట్టడం మొదలుకుని నానారకాలుగా వాటి ఉసురు తీస్తోంది. రక్తపు మడుగులో నిస్సహాయ స్థితిలో ఉన్న కుక్కలను ట్రక్కుల్లోకి విసిరేస్తున్న హృదయ విదారక దృశ్యాలు షాక్‌కు గురి చేస్తున్నాయి. 

దీనిపై ఇంటర్నేషనల్‌ యానిమల్‌ వెల్ఫేర్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ కోలిషన్‌ (ఐఏడబ్ల్యూపీసీ) ఆందోళన వ్యక్తం చేసింది. ‘మొరాకోస్‌ అగ్లీ సీక్రెట్‌’ పేరుతో ప్రచారాన్నే ప్రారంభించింది. ఇంజక్షన్లు, ఆహారం ద్వారా విషమిచ్చి కుక్కలను అమానవీయంగా చంపుతున్నారని పేర్కొంది. దీనిపై తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ ఫిఫాకు లేఖలు వెల్లువెత్తుతున్నాయి. లేదంటే ఫిఫా ప్రతిష్ట మసకబారుతుందని పర్యావరణ ప్రముఖులు హెచ్చరిస్తున్నారు. 

భయానకం... 
మొరాకో వీధుల్లో వీధి కుక్కలు నొప్పితో కేకలు వేస్తున్న వీడియోలు వైరలవుతున్నాయి. కుక్క పిల్లను తలకిందులుగా వేలాడదీసి, భయభ్రాంతులకు లోనై చూస్తున్న కుక్కల ట్రక్కులోకి విసిరేయడం కనిపించింది. మరో వీడియోలో రెండు కుక్కలు రక్తమోడుతూ నేలపై పడున్నాయి. ఇదంతా పిల్లల ముందే జరుగుతుండటంతో వారు తీవ్ర దిగ్భ్రాంకి లోనవుతున్నారని ఐఏడబ్ల్యూపీసీ తెలిపింది. దాంతో మొరాకోపై అంతర్జాతీయంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)