విశ్వ సుందరి ఫాతిమా 

Published on Fri, 11/21/2025 - 09:54

బ్యాంకాక్‌: మెక్సికో భామ ఫాతిమా బాష్‌ ఫెర్నాండెజ్‌ 2025 సంవత్సరానికి గాను విశ్వసుందరి కిరీటాన్ని దక్కించుకుంది. థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో 74వ మిస్‌ యూనివర్స్‌ పోటీలు కన్నుల పండువగా జరిగాయి. వివిధ దేశాల నుంచి 120 మంది సుందరీమణులు పాల్గొన్నారు. 25 ఏళ్ల ఫాతిమా బాష్‌ ఫెర్నాండెజ్‌ అన్ని రౌండ్లలో నెగ్గి విశ్వసుందరిగా అవతరించింది. 

మిస్‌ థాయ్‌లాండ్‌ ప్రవీనర్‌ సింగ్‌(29) మొదటి రన్నరప్‌గా ఘనత సాధించింది. మిస్‌ వెనెజువెలా స్టెఫానీ అడ్రియానా అబాసలీ నసీర్‌(25) మూడో స్థానంలో నిలిచింది. ఈ పోటీల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన మణికా విశ్వకర్మ కిరీటం దక్కించుకోలేకపోయారు. టాప్‌–12 స్థానానికి సైతం ఆమె చేరుకోలేకపోయారు. మిస్‌ యూనివర్స్‌–2025 పోటీలకు భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ సైనా నెహ్వాల్‌ న్యాయనిర్ణేతల్లో ఒకరిగా వ్యవహరించడం విశేషం.  
         

మేమంతా కలిసికట్టుగా చరిత్ర సృష్టిస్తాం 
మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో భాగంగా తుది రౌండ్‌లో జడ్జిలు అడిగిన ప్రశ్నకు ఫాతిమా బాష్‌ ఫెర్నాండెజ్‌ చెప్పిన సమాధానం అందరినీ మెప్పించింది. ప్రస్తుత ఆధునిక యుగంలో మీరు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంటున్నారు. మహిళలకు సురక్షితమైన వాతావరణాన్ని ఏర్పర్చడానికి ఈ కిరీటాన్ని మీరు ఎలా ఉపయోగిస్తారు? అని ప్రశ్నించగా.. ‘‘భద్రత, సమాన అవకాశాల విషయంలో నేటి మహిళలకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ వారు తమ భావాలను వ్యక్తం చేయడానికి ఏమాత్రం వెనుకాడడం లేదు. నేటితరం మహిళలు మార్పును కోరుకుంటున్నారు. 

మా గళాన్ని వినిపించడానికి, మార్పును ఆహా్వనించడానికి ఇక్కడికి వచ్చాం. మేమంతా కలిసికట్టుగా చరిత్ర సృష్టిస్తాం’’ అని ఫాతిమా దృఢంగా బదులిచ్చి విజేతగా నిలిచింది. ఫాతిమా ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు అభ్యసించారు. స్కూల్‌లో చదువుకుంటున్న సమయంలో డిస్లెక్సియా, హైపర్‌ యాక్టివిటీ డిజార్డర్‌తో బాధపడ్డానని గతంలో ఆమె చెప్పారు. చిన్నప్పుడు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, చివరకు సేవా మార్గంలో నడిచానని అన్నారు. మిస్‌ యూనివర్స్‌ విజేతకు 2.50 లక్షల డాలర్ల నగదు బహుమతి అందజేస్తారని సమాచారం. అంతేకాకుండా ప్రతినెలా 50 వేల డాలర్ల చొప్పున వేతనం కూడా అందుకోవచ్చు.   

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)