Breaking News

CAAపై అమెరికా ప్రకటన.. భారత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Published on Fri, 03/15/2024 - 16:09

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) విషయంలో అగ్రరాజ్యం అమెరికా ప్రకటనపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. ఈ విషయం భారత అంతర్గత విషయమని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ మాట్లాడుతూ.. 2019కు చెందిన పౌరసత్వ సవరణ చట్టం దేశానికి సంబంధించిన అంతర్గత విషషమని, ఇది దేశ సమగ్ర సంప్రదాయాలకు, మానవ హక్కుల విషయంలో తమ దీర్ఘకాల నిబద్దతకు అనుగుణంగా రూపొందించినట్లు వెల్లడించారు.

అఫ్ఘనిస్తాన్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లో హింసకు గురై 2014 వరకు భారత్‌కు వలస వచ్చిన హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, పార్శీ, క్రైస్తవ వర్గాలకు చెందిన మైనారిటీలకు భారత పౌరసత్వం, భద్రత కల్పించే ఉద్ధేశ్యంతో ఈ చట్టం తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఈ చట్టం ఏ పౌరుడి హక్కులను తొలగించదని అన్నారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు.  

పౌరసత్వ సవరణ చట్టం పౌరసత్వం ఇవ్వడం.. పౌరసత్వం తీసివేయడం గురించి కాదని అన్నారు. ఇది అందరికీ అర్థం కావాలన్నారు. ‘ఇది ఏ దేశపు జాతీయత లేని వ్యక్తి సమస్యను పరిష్కరిస్తుంది. మానవ హక్కులకు మద్దతు ఇస్తుంది. మానవ గౌరవాన్ని అందిస్తుంది’ అని పేర్కొన్నారు.

కాగా పౌరసత్వ సవరణ చట్టంపై అమెరికా స్పందించిన విషయం తెలిసిందే. సీఏఏ అమ‌లులు తీరును తాము క్షుణ్ణంగా ప‌రిశీలిస్తున్నామ‌ని ఆ దేశ విదేశాంగ శాఖ తెలిపింది. మార్చి 11వ తేదీన రిలీజైన సీఏఏ నోటిఫికేష‌న్ ప‌ట్ల ఆందోళ‌న‌గా ఉంద‌ని విదేశాంగ శాఖ ప్ర‌తినిధి మాథ్యూ మిల్ల‌ర్ తెలిపారు. సీఏఏను ఎలా అమ‌లు చేస్తార‌న్న విష‌యాన్ని గమనిస్తున్నామని, ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ‌లో అన్ని మ‌తాల‌కు స్వేచ్ఛ ఉంటుంద‌ని మిల్ల‌ర్ తెలిపారు.
చదవండి: ఎలక్టోరల్ బాండ్ల డేటాపై 'జైరాం రమేష్' కీలక వ్యాఖ్యలు

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)