Breaking News

ఎట్టకేలకు చిక్కిన పాలపుంత హృదయం!

Published on Thu, 02/26/2026 - 06:14

కేప్‌ కెనావెరల్‌: మన పాలపుంత ‘హృదయ’స్థానం ఎలా ఉంటుంది? ఇదుగో, అచ్చం ఇలా ఉంటుందట. సరిగ్గా పాలపుంత మధ్య లో ఉన్న ఈ ప్రాంతాన్ని సెంట్రల్‌ మాలిక్యులార్‌ జోన్‌ (సీఎంజెడ్‌)గా పిలుస్తున్నారు. సు దూరాల దాకా దట్టంగా పరుచుకుని సుడు లు తిరుగుతున్న ఈ ప్రాంతం ఎప్పటికప్పు డు నూతన తారలకు జన్మనిచ్చే వాయువులు తదితరాలతో కళకళలాడిపోతూ కనిపిస్తోంది. ఈ హృదయ స్థానం వైశాల్యం ఏకంగా 650 కాంతి సంవత్సరాలట!

 ఒక్క కాంతి సంవత్సరమంటే దాదాపు 9.7 లక్షల కోట్ల కిలో మీటర్లన్నది తెలిసిందే. చిలీకి చెందిన అటకామా లార్జ్‌ మిల్లీమీటర్‌ అరే (ఏఎల్‌ఎంఏ) టెలిస్కోప్‌ దీన్ని తాజాగా అత్యంత స్పష్టతతో బంధించింది. ఇందుకు సంబంధించి ఫొటోలను యూరోపియన్‌ సదరన్‌ అబ్జర్వేటరీ బుధవారం విడుదల చేసింది. ఈ సీఎంజెడ్‌లో కొత్త నక్షత్రాలు ఎలా పురుడు పోసుకుంటున్నదీ మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు ఈ ఫొటోలు ఎంతగానో దోహదపడతాయని సైంటిస్టులు చెబుతున్నారు. తద్వారా తారా మండలాల పుట్టుక, వికాసం తదితరాలపై మరింత స్పష్టత రానుంది. 

విపరీతాలకు నెలవు 
తారా మండలాల నాభి స్థానాలు (సీఎంజెడ్‌) పలు విపరీతాలకు కేంద్రమని యూరో పియ న్‌ సదరన్‌ అబ్జర్వేటరీకి చెందిన ఆష్లీ బార్న్స్‌ వివరించారు. ‘‘అక్కడ మన కంటికి చిక్కకుండా జరిగిపోయే పరిణామాలు అన్నీ ఇన్నీ కావు. వాటని ఇంత అసాధారణ స్పష్టతతో చూడగలగడం ఇదే మొదటిసారి’’అంటూ హ ర్షం వెలిబుచ్చారు. ఏఎల్‌ఎంఏ బంధించిన అతి పెద్ద ఇమేజ్‌ ఇదేనని ఆయన వెల్లడించారు. 

పాలపుంతలోని సీఎంజెడ్‌ ప్రాంతంపై ఆయన సారథ్యంలోని అంతర్జాతీయ సైంటిస్టులు, పరిశోధకుల బృందం కొంతకాలంగా లోతైన పరిశోధనలు చేస్తోంది. తాజా ఫొటో తదితరాలపై వారి అధ్యయనాన్ని రాయల్‌ ఆ్రస్టానమికల్‌ సొసైటీ తన మంత్లీ నోటీసెస్‌లో ప్రచురించనుంది. సీఎంజెడ్‌ తాలూకు 650 కాంతి సంవత్సరాల విస్తీర్ణంలో కేవలం నాభి స్థానమే కనీసం 300 కాంతి సంవత్సరాల మేరకు విస్తరించి ఉంటుందని సైంటిస్టులు చెబుతున్నారు.

 సరిగ్గా దాన్ని ఆను కుని ఉండే మిగతా ప్రాంతమంతా పాలపుంత మధ్య స్థానంలోని అత్యంత భారీ కృష్ణబిలమ ని బార్న్స్‌ వివరించారు. నాభి స్థానంలో సుడు లు తిరుగుతున్న చల్లని వాయువులే నిరంతరం భారీ నక్షత్రాల పుట్టుకకు కారణమవుతున్నాయని చెప్పారు. ఏఎల్‌ఎంఏ అందజేసిన తాజా ఫొటోల్లో ఆ వాయు నిర్మాణాలు డజన్ల కొద్దీ కాంతి సంవత్సరాల మేరకు విస్తరించి అత్యంత స్పష్టతతో కని్పస్తుండటం విశేషం. ఒక్కో నక్షత్రాన్నీ ఆవరించి ఉన్న చిన్నపాటి వాయు మేఘాలు కూడా అందులో స్పష్టంగా కనిపిస్తున్నాయి. 

‘‘సిలికాన్‌ మోనాక్సైడ్‌ వంటి సాదాసీదా వాయువులతో పాటు మెథనాల్, ఇథనాల్‌ వంటి సంక్లిష్ట వాయువుల దాకా వీటిలో ఉన్నాయి. ఈ వాయువులన్నీ నూతన తారలకు ఎలా జన్మనిస్తున్నదీ తెలుసుకునేందుకు, అవి అంతిమంగా పాలపుంత కేంద్ర స్థానంలోని అతి భారీ కృష్ణబిలం వైపు ఎలా ఆకర్షితమవుతున్నదీ విశ్లేíÙంచేందుకు, మొత్తంగా సీఎంజెడ్‌ నిర్మాణాన్ని మరింతగా అర్థం చేసుకునేందుకు ఈ ఫొటోలు ఎంతో ఉపయోగపడతాయి. పాలపుంత అంచుల్లోని నక్షత్రాలతో పోలిస్తే మధ్య ప్రాంతంలోని తారల జీవితకాలం చాలా తక్కువ. అవి యుక్తవయసు లో ఉండగానే అత్యంత శక్తిమంతమైన సూపర్‌నోవాగా, ఒక్కోసారి హైపర్‌నోవాగా మారి పేలిపోతుంటాయి. వీటన్నింటికీ మరిన్ని కారణాలు తాజా ఫొటోలతో తెలిసే అవకాశముంది’’ అని మరో పరిశోధకుడు స్టీవ్‌ లాంగ్‌మోర్‌ వివరించారు. ఇది ఇతర తారా మండలాలకు సంబంధించి కూడా మరింత అవగాహనకు దారి తీయవచ్చని ఆశాభావం వెలిబుచ్చారు.

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)