Breaking News

ఇక నేనే అధ్యక్షుడిని

Published on Wed, 10/15/2025 - 02:04

ఆంటనానారివో: తూర్పు ఆఫ్రికా ద్వీపదేశమైన మడగాస్కర్‌లో అధ్యక్షుడు ఆండ్రీ రాజోలీనా సారథ్యంలోని ప్రభుత్వాన్ని కూలదోసిన మిలటరీ కమాండర్, కల్నల్‌ మైఖేల్‌ ర్యాండ్రియానిరినా బుధవారం తన మనసులోని మాట బయటపెట్టారు. త్వరలో దేశాధ్యక్షునిగా పగ్గాలు చేపట్టబోతున్నట్లు అంతర్జాతీయ మీడియాకు చెప్పారు. జెన్‌ జెడ్‌ యువత నేతృత్వంలో మొదలైన ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం ఉప్పెనలా మారడంతో ప్రాణభయంతో అధ్యక్షుడు రాజోలీనా విదేశానికి పారిపోయారు. 

రాజోలీనా లేకపోవడంతో దేశ అత్యున్నత రాజ్యాంగ కోర్టు ఆహ్వానం మేరకు త్వరలో తాను దేశ పరిపాలనా బాధ్యతలు తీసుకోబోతున్నట్లు మైఖేల్‌ చెప్పారు. మైఖేల్‌ సారథ్యంలోని నిపుణులైన క్యాప్‌శాట్‌ సైనిక బృందం తిరుగుబాటు చేపట్టడంతో రాజోలీనా చేతులెత్తేయడం తెల్సిందే. ‘‘నిన్ననే మేం వాస్తవానికి బాధ్యతలు తీసుకోవాల్సింది. దేశంలో అధ్యక్షుడు లేడు. 

సెనేట్‌లోనూ అధ్యక్షుడి జాడ లేదు. అసలు ప్రభుత్వమే లేదు. అందుకే త్వరలో మేం నూతన ప్రధానికి నియమిస్తాం’’అని మైఖేల్‌ వ్యాఖ్యానించారు. అయితే ఎప్పటికల్లా నూతన ప్రభుత్వ ఏర్పాటు ఉంటుందనే మైఖేల్‌ స్పష్టంచేయలేదు. సెనేట్, న్యాయస్థానాలు, ఎన్నికల సంఘం అధికారులను తొలగిస్తున్నట్లు మైఖేల్‌ ఇప్పటికే జాతీయరేడియోలో ప్రకటించడం తెల్సిందే. 

1960లో ఫ్రాన్స్‌ నుంచి స్వాతంత్య్రం పొందాక మడగాస్కర్‌ ఎన్నో తిరుగుబాట్ల పాలిటపడింది. దేశంలో నిరుద్యోగం, పేదరికం పెచ్చరిల్లడం, ప్రజల జీవన వ్యయాలు పెరగడం, నీటికొరత, విద్యుత్‌ సంక్షోభం, అమాంతం పెరిగిన అవినీతితో జెన్‌జెడ్‌ యువత విసిగిపోయి ఉద్యమబాట పట్టడం, దీనికి సైనిక తిరుగుబాటు తోడవడంతో రాజోలీనా ప్రభుత్వం కూలిపోయింది.   
 

#

Tags : 1

Videos

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు