Breaking News

West Africa: పడవ బోల్తా.. 105 మంది మృతి

Published on Sat, 07/06/2024 - 08:00

పశ్చిమ ఆఫ్రికా దేశం మారిటానియా తీరంలో వలస బోటు బోల్తా పడడంతో 105 మంది మృతి చెందారు.  సహాయక చర్యలు చేపట్టిన అధికారులకు 89 మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి.

ఈ ఉదంతం గురించి ఎన్‌డియాగోలోని మత్స్యకార సంఘం అధ్యక్షుడు యాలీ ఫాల్ మాట్లాడుతూ స్థానికులు ఆ మృతదేహాలను పూడ్చిపెట్టారన్నారు. మైగ్రేషన్ రైట్స్ గ్రూప్ వాకింగ్ బోర్డర్స్  తెలిపిన వివరాల ప్రకారం 2024 మొదటి ఐదు నెలల్లో సుమారు ఐదువేల మంది వలసదారులు కానరీ దీవులకు వెళుతుండగా వివిధ బోటు ప్రమాదాల్లో మృతి చెందారు.

పశ్చిమ ఆఫ్రికా దేశపు  మత్స్యకార సంఘం అధిపతి తెలిపిన వివరాల ప్రకారం 89 మంది వలసదారుల మృతదేహాలను కోస్ట్ గార్డ్ స్వాధీనం చేసుకుంది. బోటు బోల్తా పడిన ఘటనలో ఐదేళ్ల బాలిక సహా తొమ్మిది మందిని రెస్క్యూ సిబ్బంది రక్షించారు. కాగా పశ్చిమ ఆఫ్రికా తీరం నుండి కానరీ దీవులకు చేరుకునే అట్లాంటిక్ వలస మార్గం ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన మార్గాలలో ఒకటి. ఈ మార్గాన్ని సాధారణంగా ఆఫ్రికన్ వలసదారులు స్పెయిన్ చేరుకోవడానికి ఉపయోగిస్తారు. వేసవి కాలంలో ఈ మార్గం అత్యంత రద్దీగా ఉంటుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)