Breaking News

ఖతార్‌లో ఎంఎఫ్‌ హుస్సేన్‌ మ్యూజియం

Published on Thu, 10/02/2025 - 06:24

దోహా: ప్రముఖ భారతీయ చిత్రకారుడు మక్బూల్‌ ఫిదా (ఎంఎఫ్‌) హుస్సేన్‌కు ఖతార్‌లో అరుదైన గౌరవం దక్కనుంది. ఎంఎఫహుస్సేన్‌ పేరుతో ఏర్పాటుచేసిన ప్రత్యేక మ్యూజియంను నవంబర్‌ 28న ఖతార్‌ రాజధాని దోహాలో ప్రారంభించనున్నారు. ఖతార్‌ ఫౌండేషన్‌ సంస్థ ‘లాహ్‌ వా ఖ్వాలం: ఎంఎఫ్‌ హుస్సేన్‌ మ్యూజియం’పేరుతో దీనిని ఏర్పాటుచేసింది. 

ఆర్ట్‌ అండ్‌ కల్చర్‌ ద్వారా ఎవరైనా స్ఫూర్తి పొందేందుకు, నేర్చుకునేందుకు, ఆనందంగా గడిపేందుకు ఈ మ్యూజియం వేదికగా ఉంటుందని ఖతార్‌ ఫౌండేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (కమ్యూనిటీ వ్యవహారాలు) ఖలౌద్‌ అల్‌ అలీ మంగళవారం తెలిపారు. ఖతార్‌ సంస్కృతికి ఈ మ్యూజియం అదనపు హంగుగా మారు తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ మ్యూ జియంలో ఎంఎఫ్‌ హుస్సేన్‌ వేసిన చిత్రాలు, ఆయన జీవిత విశేషాలు పొందుపరిచినట్లు వివరించారు.

 అరబ్‌ నాగరికతపై ఎంఎఫ్‌ హు స్సేన్‌ వేసిన పెయింటింగ్స్‌లో కొన్నింటిని ఈ మ్యూజియంలో ప్రదర్శిస్తారు. మ్యూజికం అద్దాలను కూడా హుస్సేన్‌ తన పెయింటింగ్స్‌లో చిత్రించిన చిత్రాల స్ఫూర్తితోనే రూపొందించటం విశేషం. ఆధునిక భారతీయ చిత్ర కారుల్లో ఎంఎఫ్‌ హుస్సేన్‌ ఒకరు. ఆయన బాంబే ప్రోగ్రెస్సివ్‌ ఆర్టిస్ట్స్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుల్లో ఒకరు. 

ఆయన చిత్రాల్లో భారతీయ నగర, గ్రామీణ జీవితం ఉట్టిపడుతుంది. ఆయన పలు చిత్రాలకు దర్శకత్వం కూడా వహించారు. 2006లో హిందూ దేవతలు, భారత మాతను నగ్నంగా చిత్రించినందుకు ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఖతార్‌కు వెళ్లిపో యారు. 2010లో ఖతార్‌ పౌరసత్వం తీసుకున్నారు. 2011 జూన్‌ 9న 95 ఏళ్ల వయసులో లండన్‌లో తుదిశ్వాస విడిచారు. భారతీయ చిత్రకళకు ఆయన ఎనలేని సేవ చేశారు.  

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)