Breaking News

తిండి లేదు.. తిప్పలు పడింది.. విశ్వాసమే మళ్లీ నెగ్గింది!

Published on Mon, 05/01/2023 - 11:26

27 రోజులు.. 64 కిలోమీటర్లు.. దారి తెలీయకున్నా ఎక్కడా ప్రయాణం ఆపలేదు. తిండి లేదు.. తోవలో తిప్పలెన్నో పడింది.. చివరకు కథ సుఖాంతం అయ్యింది. విశ్వాసానికి మారుపేరైన శునకం మరోసారి తన స్వామి భక్తిని చాటుకుని వార్తల్లోకి ఎక్కింది. అదేంటో మీరూ చదివేయండి.. 

సృష్టిలో ప్రేమ అనంతం. కానీ, ఆ ప్రేమకు స్వచ్ఛతను.. అచ్చమైన అర్థాన్ని చెప్పేవి మాత్రం కొన్నిగాథలే. మూగజీవాలు మనుషుల పట్ల కనబరిచే ప్రేమ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలా ఇక్కడో శునకం.. యజమాని(కేర్‌ టేకర్‌) కోసం చేసిన సాహసం గురించి ముమ్మాటికీ చెప్పుకోవాల్సిందే. 

పైన ఫొటోలో ఉంది కూపర్‌. Golden Retriever జాతికి చెందిన శునకం. ఒక నెలకిందట..  ఐర్లాండ్‌ ఉత్తర భాగంలోని టైరోన్‌ కౌంటీలోని ఓ ఇంటికి దత్తత వెళ్లింది. కారు నుంచి దిగీదిగగానే పరుగులు అందుకుంది కూపర్‌. అలా మొదలైన ప్రయాణం 40 మైళ్ల పాటు సాగింది. లండన్‌డెర్రీలోని టోబర్‌మోర్‌లో ఉన్న తన కేర్‌ టేకర్‌ చెంతకు చేరింది.

కనిపించకుండా పోయిన మూగజీవాల గురించి ఆరా తీసే లాస్ట్‌పాస్‌ ఎన్‌ఐ అనే ఛారిటీ కూపర్‌కు చెందిన అందమైన కథను సోషల్‌ మీడియాలో పంచుకుంది. 

దాదాపు నెలపాటు సాగిన కూపర్‌ ప్రయాణం.. ఎక్కడా ఆగలేదు. ఎవరి సాయం లేకుండానే అది ముందుకు సాగింది. దారి తెలియకపోయినా.. అది పాత ఓనర్‌ చేరుకున్న తీరు ఆశ్చర్యానికి గురి చేయిస్తోందని సదరు ఛారిటీ పేర్కొంది. మరోవైపు అది తిరిగి రావడం చూసి దానిని దత్తత ఇచ్చిన వ్యక్తి భావోద్వేగానికి లోనయ్యారు. ఇకపై కూపర్‌ ఎక్కడికి వెళ్లదని, తనతోనే ఉంటుందని కన్నీళ్లతో చెబుతున్నారు.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)