Breaking News

ఈ ప్రాంత ఆహారంతో మీ మెదడు వయస్సు తగ్గిపోతుంది..!

Published on Tue, 06/13/2023 - 13:35

కూరగాయలు ఎక్కువగా తీసుకుంటూ..జంక్ ఫుడ్‌ను తగ్గిస్తే మన మెదడు మెరుగ్గా పనిచేస్తుందని ఎన్నో నివేదికలు తెలిపాయి. కానీ ప్రస్తుతం ఓ నివేదిక మెదడు వయస్సును తగ్గించే విషయాలను వెల‍్లడించింది. మధ్యదరా ప్రాంతంలోని ఆహారంతో మెదడు వయస్సు తగ్గుతుందని ఇజ్రాయెల్‌లోని నెగేవ్ యూనివర్సిటీకి చెందిన ప్రముఖ నివేదిక స్పష్టం చేసింది. ఆ ప్రాంతంలో సాధారణంగా తీసుకునే కూరగాయలు,సీఫుడ్, తృణధాన్యాల కారణంగా శరీరంలో ఒక శాతం కొవ్వు తగ్గడమే కాకుండా మెదడు పనితీరు మెరుగుపడిందని తెలిపారు. మెదడుకు సాధారణంగా ఉండే వయస్సు కంటే తొమ్మిది నెలలు తగ్గుతుందని పరిశోధనలో తేలినట్లు వెల్లడించారు. 

102 మందితో 18 నెలలపాటు ఆ ఆహారాన్ని ఇచ్చి శరీర భాగాల పనితీరును పరిశీలించినట్లు నివేదిక పేర్కొంది. ఈ ఆహారంతో కొత్తగా వచ్చి చేరుతున్న కొవ్వు, బాడీ మాస్ ఇండెక్స్, కాలెయ పనితీరును పరిశీలించగా.. మెదడు పనితీరుపై మెరుగైన ఫలితాలు కనిపించినట్లు వెల్లడించారు. శరీర బరువు కూడా 2.3కిలోగ్రాములు తగ్గినట్లు చెప్పారు. 

ఆరోగ్యకరమైన జీవనవిధానం వల్ల మెదడుపై మెరుగైన ఫలితాలు ఉంటున్నాయని బెన్ గ్యురియన్ యూనివర్సిటీకి చెందిన న్యూరోసైంటిస్టు గిడోన్ లెవకోవ్ తెలిపారు. ప్రాసెసింగ్ ఫుడ్‌ను తగ్గించడం, స్వీట్లు, జంక్ ఫుడ్స్ మెదడు పనితీరును దెబ్బతీయడమే కాకుండా.. బయోలాజికల్ వయస్సును కూడా పెంచుతున్నట్లు తెలిపారు.  

ఇదీ చదవండి:భూమి లోతుల్లో మరో అద్భుత ప్రపంచం 


 

Videos

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)