Breaking News

2050 నాటికి 130 కోట్ల మందికి మధుమేహం

Published on Sat, 06/24/2023 - 05:45

న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా మధుమేహ వ్యాధిగ్రస్తుల సంఖ్య రానున్న 30 ఏళ్లలో విపరీతంగా పెరిగిపోనుంది. ప్రస్తుతం 50 కోట్లుగా ఉన్న చక్కెర వ్యాధి బాధితుల సంఖ్య 2050 కల్లా రెట్టింపు కంటే ఎక్కువగా 130 కోట్లకు చేరనుంది ఈ విషయాలను లాన్‌సెట్‌ పత్రిక వెల్లడించింది. ‘డయాబెటిస్‌ ప్రమాదకర స్థాయిలో పెరుగుతోంది.

ప్రపంచ దేశాల ఆరోగ్య వ్యవస్థలన్నిటికీ ఇది సవాలు వంటిదే. ఈ వ్యాధి కారణంగా ముఖ్యంగా గుండెజబ్బుల కూడా పెరుగుతాయి’అని ఈ పరిశోధనలకు సారథ్యం వహించిన యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌లోని స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన లియానె ఒంగ్‌ అన్నారు.

ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో 96 శాతం టైప్‌ 2 డయాబెటిస్‌వేనని తెలిపారు. గ్లోబల్‌ బర్డెన్‌ ఆఫ్‌ డిసీజ్‌–2021 సర్వే ఆధారంగా 1990– 2021 సంవత్సరాల మధ్య వయస్సు, లింగం ఆధారంగా 204 దేశాలు, భూభాగాల్లో మధుమేహం విస్తృతి, అనారోగ్యం, మరణాలను బట్టి 2050 వరకు మధుమేహం వ్యాప్తి ఎలా ఉంటోందో వీరు అంచనా వేశారు. వీరి అధ్యయనం ప్రకారం.. మధుమేహం వ్యాప్తి రేటు 6.1%గా ఉంది.

మరణాలు, వైకల్యానికి ప్రధాన కారణాలుగా నిలిచే టాప్‌–10 వ్యాధుల్లో డయాబెటిస్‌ కూడా ఉండటం గమనార్హం. ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యంలలో అత్యధికంగా 9.3% మంది ఈ వ్యాధికి గురికాగా 2050 నాటికి ఇది 16.8%కి చేరుకోనుంది. అదే లాటిన్‌ అమెరికా, కరీబియన్‌ ప్రాంతాల్లో అప్పటికల్లా దీని విస్తృతి 11.3% గా ఉంటుందని ఈ సర్వే తెలిపింది.

అంతేకాకుండా, 65 ఏళ్లు, ఆపైన వారే ఎక్కువగా డయాబెటిస్‌ బారినపడుతున్నారని, అన్నిదేశాల్లోనూ ఇదే ఒరవడిని గుర్తించామని లియానె ఒంగ్‌ పేర్కొన్నారు. అత్యధికంగా ఉత్తర ఆఫ్రికా, మధ్యప్రాచ్యం ప్రాంతాల్లో అత్యధికంగా ఈ వయస్సు వారిలో 39.4 శాతం మంది ఈ జబ్బు బారినపడినట్లు గుర్తించామన్నారు. అత్యల్పంగా మధ్య ఆసియా, మధ్య యూరప్, తూర్పు యూరప్‌ దేశాల్లో 19.8% మందిలోనే ఉంది.

టైప్‌2 డయాబెటిస్‌కు ప్రధానమైన 16 కారణాల్లో బీఎంఐ ప్రాథమిక కారణమని, టైప్‌ 2 డయాబెటిస్‌తో సంభవించే మరణాలు, వైకల్యాలకు ఇదే కీలకమని సర్వే తెలిపింది. ఆల్కహాల్, పొగాకు వినియోగంతోపాటు, ఆహార, వృత్తిపరమైన, పర్యావరణ సంబంధ సమస్యలతోపాటు తక్కువ శారీరక శ్రమ ఇందుకు ప్రధానమైన అంశాలని పేర్కొంది. తక్కువ, మధ్యస్థ ఆదాయం కలిగిన దేశాల్లో జన్యుసంబంధ, సామాజిక, ఆర్థిక అంశాలు కూడా ఈ వ్యాధి బారినపడేందుకు కారణాలుగా ఉన్నాయి.

Videos

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)