Breaking News

ఇండోనేషియాలో టెన్షన్‌.. బద్దలైన అగ్నిపర్వతం

Published on Thu, 11/20/2025 - 07:23

జకర్తా: ఇండోనేషియాలో భారీ విస్ఫోటనం జరిగింది. సెమెరు పర్వతం తూర్పు జావాలోని లుమాజాంగ్, మలాంగ్ జిల్లాల సరిహద్దులో ఉన్న అ‍గ్ని పర్వతం విస్పోటనం చెందింది. దీంతో, పెద్ద ఎత్తున లావా ఎగిసిపడుతోంది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం.. మంగళవారం ఇండోనేషియా స్థానిక సమయం ప్రకారం ఉదయం 6:11 గంటలకు అగ్ని పర్వతం విస్ఫోటనం చెందింది. దీంతో, ఆకాశంలోని బూడిద, ధూళి కణాలు ఎగిసిపడ్డాయి. ఈ కారణంగా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయంతో వణికిపోయారు. ఈ నేపథ్యంలో జాతీయ విపత్తు నివారణ సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహారి మాట్లాడుతూ.. అగ్ని పర్వతానికి దగ్గరగా ఉన్న మూడు గ్రామాల నుండి 300 మంది నివాసితులను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు తెలిపారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. మరోవైపు.. విస్పోటనం కారణంగా జావా ద్వీపం నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లే విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

ఇదిలాఉండగా.. 2021లో సెమెరు విస్ఫోటనం కారణంగా 50 మందికిపైగా స్థానికులు మరణించారు. 5,000 ఇళ్లు దెబ్బతిన్నాయి. ఆ విపత్తు దాదాపు 10,000 మంది నివాసితులపై ప్రభావం చూపించింది. 


 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)