Breaking News

బ్యాంకాక్‌లో నడిరోడ్డుపై భారీ సింక్‌హోల్‌

Published on Thu, 09/25/2025 - 06:33

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో నగరంలోని ఓ రహదారిపై బుధవారం ఉన్నట్టుండి భారీ గొయ్యి ఏర్పడింది. దీంతో ఆ మార్గంలో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. చుట్టుపక్కల నిర్మాణాలు, భవనాలకు ముప్పు పొంచి ఉండటంతో అధికారులు ఆ ప్రాంతాన్ని ఆగమేఘాలపై ఖాళీ చేయించారు. ఒక పోలీస్‌స్టేషన్‌ను, ఆస్పత్రి ఔట్‌పేషెంట్‌ వార్డును మూసివేశారు. విద్యుత్, నీటి సరఫరాను ఆపారు. రోడ్డుపై పేద్ద సింక్‌హోల్‌ ఏర్పడటంతో మూడు వాహనాలు దెబ్బతిన్నాయి.

 ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. భూగర్భ రైలు మార్గం నిర్మాణ పనుల వల్లే రహదారి కుంగినట్లుగా భావిస్తున్నామని వెల్లడించారు. రోడ్డు నెమ్మదిగా కుంగిపోతుండటం, ఒరిగిపోతున్న విద్యుత్‌ స్తంభాలు, పగిలిపోతున్న నీళ్ల పైపు లైన్లు, గుంత పెద్దదైన కొద్దీ కార్లు, తదితర వాహనాలు వెనక్కి మళ్లడం, పూర్తిగా ట్రాఫిక్‌ నిలిచిపోవడం వంటి వీడియోలు ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమయ్యాయి. గుంత ఒక అంచు సరిగ్గా పోలీస్‌ స్టేషన్‌ ఎదుట ఆగిపోయింది. భూగర్భ నిర్మాణం అందులో కనిపిస్తోంది. భారీ వర్షాలు కురుస్తున్నందున గుంత మరింత విస్తరించకుండా సాధ్యమైనంత త్వరగా పూడ్చివేసే చర్యలకు యంత్రాంగం ఉపక్రమించింది.

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)