Breaking News

టెహ్రాన్‌లో మిన్నంటిన నిరసనలు.. వీధుల్లోకి పోటెత్తిన ఇరానీయులు

Published on Wed, 01/28/2026 - 21:42

రాజధాని టెహ్రాన్‌లో నిరసనలు మిన్నంటాయి. ఇస్లామిక్ రిపబ్లిక్‌కు వ్యతిరేకంగా లక్ష మందికి పైగా ఇరానీయులు వీధుల్లోకి పోటెత్తారు. ఇరాన్‌లో పరిస్థితులు తీవ్ర ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్‌లో తీవ్ర ఆర్థిక సంక్షోభానికి వ్యతిరేకంగా ప్రారంభమైన ఉద్యమం.. పాలకులకు వ్యతిరేకంగా మారింది. దీంతో పరిస్థితులు నానాటికి మరింత దిగజారుతున్నాయి.

ఖమేనీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారిపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. టెహ్రాన్‌లోని 'గ్రాండ్ బజార్' నుంచి ప్రారంభమైన ఈ నిరసనలు దేశవ్యాప్తంగా వందలాది నగరాలకు పాకాయి. నిరసనకారులపై ఇరాన్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయడంతో పాటు, భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు పేర్కొంటున్నాయి. ఇరాన్‌లో మూడు వారాలుగా నిరసనలు కొన‌సాగుతున్నాయి. రాజధాని టెహ్రాన్‌తో పాటు అనేక నగరాల్లో ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.
 

 

Videos

సచివాలయ ఉద్యోగులంటే చంద్రబాబుకు ఎందుకింత కక్ష..?

పెళ్లి చూసుకున్నవాళ్లకే దిక్కులేదు... 15 ఏళ్ళు కలిసుంటారట..!

KAAKA నుంచి క్రేజీ అప్డేట్

ఓ బ్రాహ్మణ్ పై కక్ష్య సాధిస్తే... వేమిరెడ్డి దంపతులు ఇది నా ఆక్రందన! శ్రావణ్ శర్మ సతీమణి

సచివాలయం ఉద్యోగులను ఎలా ఈడ్చుకెళ్తున్నారో చూడండి

ఈసీ నియామక విధానంపై జగన్ ప్రశ్నలు.. అసలు వివాదం ఏంటి?

పాత అంబులెన్సుకు కొత్త రంగులు వేసిన ఏపీ సర్కారు

సిగ్గుందా చంద్రబాబు..! ఉద్యోగులంటే బానిసలనుకున్నారా..?

పోస్ట్ ఆఫీస్ అదిరిపోయే స్కీమ్.. నెలకు అకౌంట్లోకి 20,000

హిమాలయాల్లో పెను సునామీ! 200 కోట్ల మందికి డేంజర్ బెల్స్!

Photos

+5

భర్తతో కలిసి మలేసియా ట్రిప్‌లో హీరోయిన్ అపర్ణ(ఫొటోలు)

+5

'ప్యారడైజ్'లో కేసీఆర్‌ని పోలిన పాత్ర.. షూటింగ్‌లో ఇలా(ఫొటోలు)

+5

బర్త్‌ డే సెలబ్రేషన్స్‌ వైబ్‌లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి (ఫోటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’లో సంపూర్ణేష్‌ బాబు భార్యగా విషిక.. గ్లామర్‌ ఫొటోలు వైరల్‌

+5

మిజ్వాన్‌ ఫ్యాషన్‌ షోలో అలియా, విక్కీ సందడి(ఫోటోలు)

+5

నాలుగు పదులు దాటినా మరింత గ్లామరస్‌గా శ్రియా శరణ్..(ఫోటోలు)

+5

ప్రీతి ముకుందన్‌ స్పెషల్‌ మూమెంట్‌ (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సక్సెస్‌ మీట్‌ (ఫొటోలు)

+5

‘సిగ్మా’ ప్రీ-రిలీజ్ వేడుకలో మెరిసిన ఫరియా అబ్దుల్లా (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఇంకా కొనసాగుతున్న గణేష్ నిమజ్జనాలు.. ట్యాంక్ బండ్ వద్ద భారీ క్యూ...(ఫొటోలు)