ప్రకృతి విలయతాండవం.. 2,000 మంది మృతి

Published on Mon, 05/27/2024 - 14:00

పాపువా న్యూ గినియాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొండచరియలు విరిగి పడిన ఘటనలో దాదాపు 2000 మంది సజీవ సమాధి అయ్యారని ఆ దేశ నేషనల్‌ డిజాస్టర్‌ సెంటర్‌ పేర్కొంది. ఈ మేరకు ఐరాస ఆఫీసుకు పాపువా న్యూ గినియా అధికారులు సమాచారం ఇచ్చారు.

వివరాల ప్రకారం.. పావువా న్యూ గినియాలో కొండ చరియలు విరగిపడ్డాయి. ఈ ప్రమాదంలో దాదాపు రెండు వేల మంది సజీవ సమాధి అయ్యారు. కొండచరియలు విరిగిపడటంతో దాదాపు 200 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఈ బీభత్సం సంభవించింది. కొన్ని చోట్ల 8 మీటర్ల ఎత్తున శిథిలాలు కుప్పలుగా పడినట్టు సమాచారం. కాగా, చాలా చోట్ల ఇలా కొండచరియలు విరిగి పడుతుండటంతో మరణాల సంఖ్య పెరుగుతోంది. పెద్ద సైజులో బండరాళ్లు ఉండటంతో మృతదేశాల వెలికితీత కష్టంగా మారింది.  

 

 

ఇక, ఈ ప్రమాద ఘటన కారణంగా 2000 మంది మరణించారని ఆ దేశంలోని నేషనల్‌ డిజాస్టర్‌ సెంటర్‌ నుంచి ఐరాస ఆఫీస్‌కు సమాచారం వెళ్లింది. ఈ మేరకు సోమవారం ఉదయం లేఖను ఆ కార్యాలయానికి పంపింది. తమ దేశానికి తగు సాయం అందించాలని కోరింది. అలాగే, మిత్రదేశాలు అందించే సాయాన్ని డిజాస్టర్‌ సెంటర్‌ ద్వారా సమన్వయం చేసుకొంటామని అక్కడి ప్రభుత్వం పేర్కొంది.

 

అయితే, ఎంగా ప్రావిన్స్‌లోని యంబాలి గ్రామంపై శుక్రవారం తెల్లవారుజామున ఒక్కసారిగా మౌంట్‌ ముంగాల కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సందర్భంగా ప్రావిన్స్‌లో భారీ నష్టం వాటిల్లింది. ఆ ప్రాంతంలో ఉన్న నివాసాలు దాదాపు నేలమట్టమయ్యాయి. కొండచరియల కారణంగా ప్రజా రవాణాకు సైతం తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. 

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)