Breaking News

బ్యాంకాక్‌లో కాల్పుల కలకలం 

Published on Mon, 07/28/2025 - 13:49

బ్యాంకాక్‌: థాయ్‌లాండ్‌ రాజధాని బ్యాంకాక్‌లో సోమవారం ఓ వ్యక్తి ఐదుగురిని కాల్చి చంపాడు. వ్యవసాయ ఉత్పత్తులతోపాటు ఆహారాన్ని విక్రయించే ఓర్‌ టోర్‌ కోర్‌ మార్కెట్‌లో ఈ ఘటన జరిగింది. నలుగురు సెక్యూరిటీ గార్డులను, ఒక మహిళను కాల్చి చంపిన దుండగుడు చివరకు తనను తాను కాల్చుకున్నాడు. దీంతో మృతుల సంఖ్య ఆరుకు చేరింది. 

బ్యాంకాక్‌లోని ప్రధాన పర్యాటక కేంద్రంగా సందర్శకులను ఆకటుఏ్టకునే చతుచక్‌ మార్కెట్‌కు కొద్ది దూరంలోనే ఈ ఓర్‌ టోర్‌ కోర్‌ మార్కెట్‌ ఉంది. దుండగుడు వరుస కాల్పులు జరుపుతుండగా ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగెత్తుతున్న దృశ్యం, మృతదేహాలు వీధిలో చెల్లా చెదురుగా పడి ఉన్న దృశ్యం మార్కెట్‌ సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌లో కనిపించింది. కాల్పుల తర్వాత నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడని, అతడిని గుర్తించడానికి పోలీసులు ప్రయతి్నస్తున్నారు.

 ప్రస్తుతం థాయ్‌లాండ్, కంబోడియా మధ్య సరిహద్దు ఘర్షణలు జరుగుతున్న నేపథ్యంలో ఘర్షణలకు, కాల్పులకు ఏదైనా సంబంధం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.  థాయిలాండ్‌లో కాల్పులు చాలా సాధారణం. నియంత్రణ అమలులో లోపాల కారణంగా ఇక్కడ తుపాకీలు పొందడం చాలా సులభం. గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ తుపాకీ హింస విపరీతంగా పెరిగింది.

 ఈ ఏడాది మేలో థాయ్‌లాండ్‌లోని యు థాంగ్‌ జిల్లాలో 33 ఏళ్ల వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ దాడిలో ముగ్గురు మరణించారు. 2023 అక్టోబర్‌లో బ్యాంకాక్‌లోని సియామ్‌ పారగాన్‌ మాల్‌లో 14 ఏళ్ల బాలుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించారు.చాలా మంది గాయపడ్డారు. 2022 అక్టోబర్‌లో జరిగిన మరో దారుణ సంఘటన జరిగింది. థాయ్‌ మాజీ పోలీసు ఒకరు పిల్లల సంరక్షణ కేంద్రంలో జరిపిన కాల్పుల్లో 24 మంది పిల్లలు సహా దాదాపు 36 మంది మరణించారు.  

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)