Breaking News

సునీత లానే అంతరిక్షంలో చిక్కుకుపోయిన ‘హీరో’

Published on Wed, 03/19/2025 - 13:36

భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams) 9 నెలల 14 రోజులపాటు అంతరిక్షంలో  చిక్కుకుపోయారు. సుదీర్ఘకాలం తరువాత ఆమె భూమికి చేరుకోవడంతో ప్రపంచమంతా ఆమెను అభినందిస్తోంది. అచ్చం ఇదే ఉదంతాన్ని పోలిన ఆంగ్ల సినిమా ‘ది మార్టిన్’ 2015లో విడుదలయ్యింది.

ఈ సినిమాలో హీరో అంతరిక్ష ప్రయాణానికి వెళ్లి వ్యోమనౌక(Spaceship)లోని సాంకేతిక లోపం కారణంగా అక్కడే చిక్కుకుపోతాడు. దీని తర్వాత కథ చాలా ఆసక్తికరంగా సాగుతుంది. ఈ చిత్రం ఏడు ఆస్కార్ అవార్డులను గెలుచుకుంది. ఈ చిత్రం మంచి వసూళ్లను కూడా రాబట్టింది. దర్శకుడు రాడ్లీ స్కాట్ రూపొందించిన ఈ సినిమా ప్రేక్షకులకు ఎంతగానో నచ్చింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్‌హిట్ కావడంతో పాటు పలు అవార్డులను కూడా కొల్లగొట్టింది. ఈ సినిమా- 2016 ఆస్కార్ అవార్డులలో  ఏడుకుపైగా టైటిళ్లను దక్కించుకుంది.  ప్రపంచవ్యాప్తంగా 200కు పైగా నామినేషన్లను అందుకుంది. 40కి పైగా అవార్డులను కూడా గెలుచుకుంది. ఈ సినిమా కథను డ్రూ గార్ఫీల్డ్, ఆండీ వీర్ రూపొందించారు. మాట్ డామన్, జెస్సికా చస్టెయిన్,  క్రిస్టీన్ వింగ్ ప్రధాన పాత్రల్లో కనిపించారు.

‘ది మార్టిన్’(The Martian) సినిమా కథ సునీతా విలియమ్స్ అంతరిక్ష యాత్రను పోలివుంటుంది. ఈ సినిమా కథలో మార్క్ వాట్నీ అనే వ్యోమగామి తన సిబ్బందితో కలిసి అంతరిక్ష మార్స్ మిషన్‌కు వెళతాడు. అయితే మార్గం మధ్యలో అనుకోని పరిస్థితుల్లో సిబ్బంది నుంచి వేరయిపోతాడు. తరువాత మార్క్ వాట్నీ ఒక గ్రహంపైకి అడుగుపెడతారు. ఈ నేపధ్యంలో మార్క్ వాట్నీ చనిపోయాడని నాసా భావిస్తుంది. అయితే ఆ గ్రహం మీద ఉన్న మార్క్ వాట్నీ తన మనుగడ కోసం  అన్నిరకాలుగా ప్రయత్నిస్తాడు. ఇలా కొంతకాలం గడిచాక మార్క్ భూమిపైకి దిగడంలో విజయం సాధిస్తాడు. ఈ సినిమా.. ప్రేక్షకులకు అంతరిక్ష ప్రయాణ అనుభూతినిస్తుంది. అంతరిక్ష ప్రపంచంలో సినిమాటిక్ టూర్ చేయాలనుకున్నవారు ఈ సినిమాను చూడవచ్చు.

ఇది కూడా చదవండి: Sunita Williams: భూమి మిమ్మల్ని మిస్‌ అయ్యింది: ప్రధాని మోదీ

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)