Breaking News

పాలసంద్రంలో కృష్ణశిల 

Published on Tue, 12/23/2025 - 05:39

తెల్లని నురగలతో నిండిన పాలసంద్రంలోకి పడిపోతున్న నల్లరాయిలా కన్పిస్తున్న ఈ శిల వాస్తవానికి ఒక ఉపగ్రహం. దీని పేరు ఫోబోస్‌. ఇది అంగారకుని చుట్టూ పరిభ్రమిస్తోంది. మార్స్‌కు అత్యంత సమీపంగా అంతర్గత కక్షలో తిరిగే ఈ ఫోబోస్‌ తాజా ఫొటోలను యూరోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ(ఈఎస్‌ఏ) ఇటీవల క్లిక్‌ మనిపించి విడుదలచేసింది. ఇమేజ్‌ స్పెషలిస్ట్‌ అయిన ఆండ్రియా లక్‌ ఈ ఫొటోలను అందరితో పంచుకున్నారు. 

ఈఎస్‌ఏ వారి ‘మార్స్‌ ఎక్స్‌ప్రెస్‌ ఆర్బిటార్‌’ ద్వారా ఈ ఫొటోలను తీశారు. ఓ పేద్ద బంగాళదుంపకు అతుక్కున్న రాయిలా ఈ ఉపగ్రహం భలేగా కన్పిస్తోందని ఒక నెటిజన్‌ తన ‘ఎక్స్‌’ ఖాతాలో పోస్ట్‌పెట్టారు. సౌరవ్యవస్థలోనే అత్యంత వైవిధ్యమైన నేలలున్న గ్రహంగా మార్స్‌ పేరొందింది. విస్తారమైన అగ్నిపర్వత నేలలు, రుధిరవర్ణ ఉపరితలం మీదుగా గగనతలంలో నల్లటి ఫోబోస్‌ దూసుకుపోవడం ఫొటోల్లో మరింత అందంగా కన్పిస్తోంది. ఫోబోస్‌ వెడల్పు 27 కిలోమీటర్లు మాత్రమే. అత్యల్ప స్థాయి సహజ ఉపగ్రహాల తీరుతెన్నులను గమనించేందుకు ఇలాంటి ఫొటోలు అక్కరకొస్తాయని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.     

–సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)