Breaking News

భార్యను హత్య చేశాడు.. కానీ కోర్టు నిర్దోషని తెలిపింది

Published on Sat, 07/22/2023 - 19:33

లండన్: సిప్రస్ లో తన భార్యను చంపిన కేసులో ఓ హంతకుడిని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. బ్లడ్ క్యాన్సరుతో బాధపడుతున్న భార్య జానీస్ హంటర్ బాధను తట్టుకోలేక తానే చంపమని కోరిందని, తప్పని పరిస్థితుల్లో నిందితుడు డేవిడ్ హంటర్ ఆమె ఆత్మహత్యకు సాయం చేశాడని హంతకుడి తరపు న్యాయవాది కోర్టుకి వాదనలు వినిపించగా కోర్టు ఆ వాదనలతో ఏకీభవించింది. డేవిడ్ హంటర్ నరహంతకుడిగా అనిపించడం లేదని తెలిపింది. 

డేవిడ్ హంటర్(76) భార్య జానీస్ హంటర్ బ్లడ్ క్యాన్సర్ వ్యాధి బారిన పడింది. చూస్తుండగానే వ్యాధి ముదిరిపోవడంతో చివరి రోజుల్లో ఆమె నొప్పిని భరించలేకపోయింది. బ్రతికి ఉండటం కంటే చనిపోవడమే మేలని తరచూ భర్తకు గోడు వినిపించేది. చివరికి ఒకరోజు బాధ తీవ్రం కావడంతో తనను చంపి నొప్పి నుండి విముక్తి కలిగించమని భర్తను వేడుకుంది. తాను ఎంతగానో ప్రేమించిన భార్య అంత వేదన భరించడాన్ని చూడలేకపోయిన హంటర్ మరో  ప్రత్యామ్నాయం లేక 2021 డిసెంబర్లో భార్యను కడతేర్చాడు. 

దీంతో హంటర్ పై హత్యా నేరం మోపబడింది. భార్య ఆవేదన తట్టుకోలేకే ఆమెను చంపినట్టు హంటర్ పదేపదే కోర్టుకు విన్నవించాడు. అతని తరపు వకీలు కూడా ఇదే విషయాన్ని కోర్టుకు చెప్పుకొచ్చారు. తన భార్య చివరి రోజుల్లో చూడ విహీనంగా తయారైన తన ఆకృతిని ఎవరికీ చూపించలేక మానసికంగా బాగా కుంగిపోయిందని, తనకు డైపర్లు కూడా మార్చేవాడినని, తనకోసం నేను అంతగా శ్రమ పడటం చూడలేకపోయింది. దాన్ని తలచుకుని ఇంకా ఎక్కువ బాధపడేది. ఒకానొక దశలో బాధని తట్టుకోలేక ఎలాగైనా తనను చంపేయమని ఆరేడు వారాలు ప్రాధేయపడిందని, తప్పని పరిస్థితులలోనే అలా చేశానని కోర్టుకు తెలిపారు హంటర్. 

వాదోపవాదాలు విన్న తర్వాత కోర్టు హంటర్ నరహంతకుడేమీ కాదని వ్యాఖ్యానించింది. కోర్టు తన అభిప్రాయం వెల్లడించిన తర్వాత హంటర్ కళ్ళు చెమ్మగిల్లాయి. మూడేళ్ళుగా జైలులో మగ్గిపోతున్న తన తండ్రి ఎట్టకేలకు బయటకు రానున్నారని సంతోషాన్ని వ్యక్తం చేసింది హంటర్ కుమార్తె. జులై 27న హంటర్ నిర్దోషని తీర్పు వెలువడటమే తరువాయి అమ్మ సమాధి దగ్గరకు వెళ్ళిపోతారని చెప్పుకొచ్చింది. 

ఇది కూడా చదవండి: ఆ రెస్టారెంట్‌లో తిన్న తర్వాత హాయిగా పడుకోవచ్చు.. 

Videos

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)