Breaking News

అమెరికాలో భారతీయుడికి షాక్‌.. గంటన్నర చికిత్సకు 3.5 లక్షల బిల్లు!

Published on Sat, 01/24/2026 - 02:48

అమెరికా వెళ్లాలనుకోవటం చాలా మంది భారతీయుల కల. అక్కడికి వెళ్లి విలాసవంతమైన జీవితం గడపవచ్చు, ఆర్దికంగా ఎదగవచ్చని భావిస్తుంటారు. అయితే అగ్రరాజ్యంలో వైద్యం మాత్రం సామాన్యుడికి అందనంత దూరంలో ఉంది. అమెరికాలో అనారోగ్యం పాలైతే మాత్రం జేబులకు చిల్లులు పడడం ఖాయం.

ఇలాంటి అనుభవమే అరిజోనాలో నివసిస్తున్న ఓ భారతీయుడికి ఎదురైంది. జైపూర్‌కు చెందిన పార్త్ విజయ్‌వర్గియా ఉద్యోగ రీత్యా అరిజోనాలో ఉంటున్నారు. అయితే పార్త్ ఇటీవల ఐస్ స్కేటింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు గాయపడ్డాడు. తీవ్రమైన నొప్పితో బాధపడుతున్నప్పటికీ, అంబులెన్స్ ఖర్చులకు భయపడి తన కారులోనే హాస్పిటల్‌కు వెళ్లాడు. 

అతడు అస్పత్రిలో కేవలం 90 నిమిషాలు మాత్రమే గడిపాడు. అతడికి ప్రాథమిక చికిత్స అందించి పంపించారు. అయితే ఆ తర్వాత అతడు తనకు వచ్చిన బిల్ చూసి షాకయ్యాడు. విజయ్‌వర్గియాకు ఏకంగా బిల్లు 4,000 డాలర్లు (సుమారు రూ.3.36 లక్షలు) బిల్లు వచ్చింది. పార్త్‌కు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. 

అయినప్పటికీ, అతడు తన జేబు నుండి 1,800 డాలర్లు (దాదాపు రూ.1.5 లక్షలు) చెల్లించాల్సి వచ్చింది. మీ వెనుక ఆర్ధికంగా సపోర్ట్ ఉంటేనే అమెరికాకు రావాలని పార్త్ విజయ్‌వర్గియా సూచించాడు. కేవలం జీతం మీద మాత్రమే ఆధారపడితే ఇటువంటి సమస్యలు ఎదుర్కొక తప్పదని అతడు హెచ్చరించాడు.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)