Breaking News

కేసులతో సంబంధమే లేదు.. పోలీసులను చూడగానే పరుగందుకుని..

Published on Fri, 07/28/2023 - 13:14

వాషింగ్టన్: పోలీసులను రక్షకభటులని అంటారు. కానీ దొంగల కంటే వారిని చూస్తేనే ఎక్కువగా భయపడుతుంటారు జనం. ఆ భయమే అమెరికాలో ఓ అభాగ్యుడిని పొట్టనబెట్టుకుంది. పోలీసులు ఎందుకు వచ్చారో ఏంటో తెలుసుకోకుండా వారు కనపడగానే భయంతో పరిగెత్తుకుంటూ వెళ్లి కన్నింగ్ హాం సరస్సులోకి దూకేశాడు. కొద్దిసేపు ఈత కొట్టే ప్రయత్నం చేసిన అతను చూస్తుండగానే నీటమునిగిపోయాడు. 

గ్రీన్‌విల్లే కౌంటీ పోలీసు అధికారులు బెయిలుపై ఉన్న ఒక వ్యక్తికి అరెస్ట్ వారెంట్ జారీ కావడంతో నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు కన్నింగ్ హాం రోడ్డులోని ఒక ఇంటిలోకి వెళ్లారు. ఆ సమయంలో అక్కడున్నాడు చక్ గిల్బర్ట్ షెల్టన్ జూనియర్ (38). కేసుతో అసలు ఏమాత్రం సంబంధం లేని అతడు పోలీసులను చూస్తూనే పరుగందుకున్నాడు. అది చూసి బిత్తరపోయిన పోలీసులు వాడెందుకు పరిగెడుతున్నాడన్న డైలమాలో ఉండిపోయారు. అంతలోనే గిల్బర్ట్ షెల్టన్ దగ్గర్లో ఉన్న కన్నింగ్ హాం సరస్సులోకి దూకేశాడు. 

ఒడ్డు నుండి 15-20 అడుగుల దూరం ఈత కొట్టుకుంటూ వెళ్లిన షెల్టన్ క్రమక్రమంగా మునిగిపోయాడు. వెంటనే గ్రీన్‌విల్లే పోలీసులు,  స్థానిక ఈతగాళ్లు కొందరు కాలువలోకి దూకి వెతికినా ప్రయోజనం లేకపోయింది. సుదీర్ఘంగా కొనసాగిన గాలింపుల తర్వాత అతడి మృతదేహాన్ని వెలికితీశారు. అతను ఎందుకు పారిపోయాడు? అతడిపై నేరారోపణలు ఏమైనా ఉన్నాయా? అన్న కోణంలో విచారణ  చేస్తున్నారు పోలీసులు. ఏదైతేనేం భయం దెయ్యం కంటే చెడ్డదని మరోసారి రుజువైంది. 
ఇది కూడా చదవండి: ఖలిస్థానీల ముసుగులో అక్రమ వలసలు..        

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)