Breaking News

మనిషిని కుక్క షూట్‌ చేసింది!!

Published on Wed, 03/12/2025 - 07:00

మెంఫిస్‌ సిటీ: కుక్క మనిషిని కరవడం వార్తకాదు.. మనిషే కుక్కను కరవడం వార్త అని గతంలో ఒక ఫేమస్‌ వాక్యం ఉండేది. ఇప్పుడు దానిని ‘‘మనిషి కుక్కను షూట్‌ చేయడంకాదు.. కుక్క మనిషిని షూట్‌ చేయడం వార్త’’ అని మార్చి రాసుకోవాలేమో. ఇలాంటి ఉదంతం సోమవారం తెల్లవారుజామున అమెరికాలో జరిగింది. టెన్నిస్సీ రాష్ట్రంలోని మెంఫిస్‌ సిటీ సమీప ఫ్రేసర్‌ గ్రామంలో ఈ ఘటన జరిగింది. జెరాల్డ్‌ కిర్క్‌వుడ్‌ అనే వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి బెడ్‌పై నిద్రిస్తుండగా తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఏడాది వయస్సున్న పిట్‌బుల్‌ జాతి పెంపుడు శునకం ఆ గదికి వచ్చింది.

 వీళ్లిద్దరూ నిద్రిస్తూ బెడ్‌ మీద ఒక గన్‌ను అలాగే వదిలేశారు. దాంట్లో బుల్లెట్లు లోడ్‌చేసి ఉన్నాయి. శునకం ఒక్క ఉదుటున బెడ్‌ మీదకు దూకింది. అది సరిగ్గా గన్‌ ట్రిగ్గర్‌పై దూకడంతో ట్రిగ్గర్‌ నొక్కుకుని గన్‌ పేలింది. దీంతో దూసుకొచి్చన బుల్లెట్‌ ఆ వ్యక్తి ఎడమ తొడను పైపైన చీలిస్తూ బయటకు దూసుకెళ్లింది. బుల్లెట్‌ గాయంతో జెరాల్డ్, అతని గర్ల్‌ఫ్రెండ్‌ల నిద్ర మొత్తం ఒక్క దెబ్బతో పోయింది. రక్తమోడుతున్న జెరాల్డ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించారు.

 ఆయనకు ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. శునకం కారణంగా గన్‌ పేలిన ఘటనపై బాధితుడిని మీడియా ప్రశ్నించింది. కుక్క దూకడంతో నిద్రలేచారా? బుల్లెట్‌ గాయంతో లేచారా? అని ప్రశ్నించగా రెండూ ఒకేసారి జరిగాయని ఆయన నవ్వుతూ చెప్పడం విశేషం. ఆ ఆయుధాన్ని అతని గర్ల్‌ఫ్రెండ్‌ తర్వాత తీసుకెళ్లింది. ఓరియో పేరున్న ఆ కుక్కపై పోలీసులు ఎలాంటి కేసు నమోదుచేయలేదు.       

#

Tags : 1

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)