Breaking News

Maldives: మాల్దీవుల పార్లమెంట్‌లో ఎంపీల కొట్లాట

Published on Sun, 01/28/2024 - 19:33

పార్లమెంట్‌లో ఎంపీలు తీవ్రంగా విమర్శలు చేసుకోవటం వింటున్నాం. కానీ చట్టాలు చేయాల్సిన ప్రజాప్రతినిధులు వీధి రౌడీల్లా కొట్టుకోవటం చూశారా? మాల్దీవుల పార్లమెంట్‌లో అధికార పార్టీ ఎంపీలు, ప్రతిపక్ష పార్టీ ఎంపీలు బాహాబాహికి దిగారు.

మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జు కేబినెట్‌లోని మంత్రుల సంబంధించి పార్లమెంట్‌ ఆమోదం కోసం ఆదివారం ఏర్పాటు చేసిన  పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశంలో తీవ్రమైన ఘర్షణ చెలరేగింది. దీనికి సంబంధించిన ఓ వీడియో బయటకు వచ్చింది. ప్రస్తుతం మాల్దీవుల ప్రజా ప్రతినిధుల ఘర్షణ వీడియో సోషల్‌ మీడియా వైరల్‌గా మారింది.

అధికారపార్టీ పీపుల్స్‌ నేషనల్‌ కాంగ్రెస్‌(PNC), ప్రభుత్వ అనుకూల పార్టీ ప్రొగ్రెసీవ్‌ పార్టీ ఆఫ్‌ మాల్దీవ్స్‌(PPM) ఎంపీలకు... ప్రతిపక్ష పార్టీ మాల్దీవీయిన్‌ డెమోక్రటిక్‌ పార్టీ (MDP)ఎంపీల మధ్య గొడవ జరిగింది. అయితే అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జు కేబినెట్‌లో నలుగురు మంత్రుల ఆమోదానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీ నిరసన తెలియజేశారు.

ఈ క్రమంలోనే  పీఎన్‌సీ ఎంపీ షహీమ్‌.. ఎండీపీ ఎంపీ ఇసా కాలు పట్టుకొని నేలపై పడగొట్టాడు. దీంతో ఇసా... షహీమ్ మెడపై పిడిగుద్దులు గుద్దాడు. సహచర ఎంపీలు వారిగొడవను శాంతింపచేశారు. తీవ్రంగా గాయపడ్డ షహీమ్‌ను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

అధ్యక్షుడు మహ్మద్‌ మొయిజ్జు మంత్రి వర్గంలోని మంత్రులకు ఆమోదం తెలపకపోవటంతో పాటు స్పీకర్‌ రాజీనామా చేయాలని ప్రతిపక్షాల డిమాండ్‌ చేశాయి. మరోవైపు కెబినెట్‌లో మంత్రులకు ఆమోదం తెలపకపోవటం ప్రజా సేవలకు విఘాతం కల్పించడమేనని ప్రతిపక్షాలపై అధికారపార్టీ పీపుల్స్‌ నేషనల్‌ పార్టీ మండిపడుతోంది.

చదవండి: Dinosaurs: పక్షులు డైనోసార్ల వంశమా?

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)