Breaking News

నెదర్లాండ్స్‌ నౌకలో భారీ అగ్నిప్రమాదం

Published on Thu, 07/27/2023 - 05:13

ది హేగ్‌: నెదర్లాండ్స్‌లోని ఉత్తర సముద్రంలో సరుకు రవాణా చేసే ఒక నౌకలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మంటల్లో నౌకలో ఉన్న 3 వేల కార్లు దగ్ధమైనట్టు అంచనా. నౌక సిబ్బందిలో ఒకరు మంటల్లో చిక్కుకొని మరణించగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఇంకొందరు ప్రాణరక్షణ కోసం సముద్రంలో దూకారు. ఆ నౌకలో దట్టంగా పొగ అలుముకోవడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తి 22 మంది నౌకా సిబ్బందిని ఆస్పత్రికి తరలించినట్టుగా డచ్‌ కోస్ట్‌గార్డ్‌ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.

నౌకలో ఉన్న 25 ఎలక్ట్రిక్‌ కారుల్లో ఒక దానిలో మంటలు చెలరేగడం వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. జర్మనీలోని బ్రెమర్‌హెవన్‌ పోర్టు నుంచి ఈజిప్టులో మరో పోర్టుకి ఈ నౌక వెళుతుండగా మంగళవారం రాత్రి అమెలాండ్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ నౌకలో మంటలు కొద్ది రోజుల పాటు కొనసాగుతాయని డచ్‌ కోస్ట్‌ గార్డ్‌ అంచనా వేస్తోంది. నౌకకి ఇరువైపులా నీళ్లు పోస్తూ మంటల్ని అదుపులోనికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ లోపల నీళ్లు వేస్తే నౌక మునిగిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళనలున్నాయి. ఎలక్ట్రిక్‌ వాహనాలు తరలించడం కూడా ఒక ముప్పుగా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.     

 

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)