Breaking News

అధ్యక్షుడు ముయిజ్జుపై అవిశ్వాసం

Published on Tue, 01/30/2024 - 06:33

మాలె: మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జుపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం మాల్దీవియన్‌ డెమోక్రాటిక్‌ పార్టీ (ఎండీపీ) సిద్ధమవుతోంది. ఎండీపీకి పార్లమెంట్‌లో మెజారిటీ ఉంది. చైనా అనుకూల అధ్యక్షుడు ముయిజ్జు కేబినెట్‌లోకి నలుగురు మంత్రులను చేర్చుకునే అంశంపై ఆదివారం పార్లమెంట్‌లో ఓటింగ్‌ జరిగింది. నలుగురిలో ఒక్కరికి మాత్రమే పార్లమెంట్‌ ఆమోదం తెలిపింది. ముగ్గురిని తిరస్కరించింది.

ఇందుకు ఆగ్రహిస్తూ అధికార పక్షం ఎండీపీకి చెందిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌లపై అవిశ్వాసం ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రతిపక్ష ఎంపీలు బాహాబాహీకి దిగారు. ఇద్దరు గాయపడ్డారు. ఈ పరిణామాలతో ఎండీపీ, మిత్రపక్షం డెమోక్రాట్లతో కలిసి ముయిజ్జుపై అవిశ్వాసం పెట్టాలని సోమవారం నిర్ణయించింది. పార్లమెంట్‌లో మొత్తం 80 మంది సభ్యులకు గాను ఎండీపీకి 45 మంది, డెమోక్రాట్లకు 13 మంది ఉన్నారు.

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)