Breaking News

మంచులో చిక్కుకున్న లగ్జరీ షిప్.. 400 మందిని కాపాడిన 'పోలార్ స్టార్'

Published on Mon, 01/26/2026 - 04:00

అంటార్కిటికా ఖండం మొత్తం మంచుతోనే కప్పబడి ఉంటుంది. గడ్డకట్టే చలి, అడుగు తీసి అడుగు వేయలేనంత దట్టమైన మంచు పలకలు ఆవరించి ఉంటాయి. అయితే అటువంటి ప్రమాదకర పరిస్థితుల్లో ఇటీవల 400 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న ఒక లగ్జరీ క్రూయిజ్ షిప్ ప్రమాదవశాత్తు ఇరుక్కుపోయింది. అమెరికా కోస్ట్ గార్డ్ రంగంలోకి దిగి వారిని రక్షించారు.

అసలేమి జరిగిందంటే?
ఆస్ట్రేలియాకు చెందిన 'సీనిక్ ఎక్లిప్స్ II' అనే విలాసవంతమైన నౌక గత వారం అంటార్కికా సమీపంలోని  రాస్ సీ దట్టమైన మంచు గడ్డల మధ్య చిక్కుకుపోయింది. అంగుళం కూడా కదలలేని షిప్ ఉండిపోయింది. షిప్‌లో సుమారు 228 మంది ప్రయాణికులు, 176 మంది సిబ్బంది ఉన్నారు. వెంటనే సహాయం కోసం అమెరికా కోస్ట్ గార్డ్‌ను సంప్రదించారు.

దీంతో అదేసమయంలో అటుగా వెళ్తున్న యూఎస్ కోస్ట్ గార్డ్‌కు చెందిన భారీ ఐస్‌బ్రేకర్ నౌక 'పోలార్ స్టార్' రంగంలోకి దిగింది. పోలార్ స్టార్ క్రూయిజ్ షిప్ చుట్టూ ఉన్న గట్టి మంచు గడ్డలను ముక్కలు చేస్తూ ముందుకు వెళ్లింది. క్రూయిజ్ షిప్ కదలడానికి వీలుగా మంచులో ఒక కాలువ లాంటి మార్గాన్ని ఏర్పరిచింది. 

పోలార్ స్టార్ ఏర్పరిచిన మార్గం ద్వారా 'సీనిక్ ఎక్లిప్స్ II' మంచు పలకల నుంచి బయటకు వచ్చింది. దీంతో షిప్‌లో ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు. పోలార్ స్టార్ అనేది ఏకైక భారీ ఐస్‌బ్రేకర్ నౌక కావడం గమనార్హం. అంటార్కిటికాలోని శాస్త్రవేత్తలకు సరుకులు చేరవేయడానికి వెళ్తుండగా ఈ రక్షణ చర్యలో పోలార్ స్టార్ పాల్గొంది.
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)