Breaking News

తప్పిపోయినా.. శునకం వద్ద క్షేమం..!

Published on Sun, 09/24/2023 - 05:08

మిషిగన్‌: రాత్రి వేళ రెండు పెంపుడు కుక్కలతోపాటు కనిపించకుండా పోయిన ఓ చిన్నారి కోసం పోలీసులు, స్థానికులు కలిసి అటవీ ప్రాంతంలో భారీగా గాలించారు. ఇందుకోసం డ్రోన్లు, పోలీసు జాగిలాలను సైతం వాడారు. చివరికి ఆల్‌ టెర్రయిన్‌ వెహికల్‌(ఏటీవీ) చిన్నారి జాడను కనిపెట్టింది. అప్పటికే ఆ చిన్నారి ఒక పెంపుడు కుక్కను దిండుగా చేసుకుని నిద్రిస్తుండగా మరో శునకం జాగ్రత్తగా కాపలా కాస్తూ కనిపించింది. ఇది చాలా అద్భుతమైన విషయమని అందరూ అంటున్నారు.

అమెరికాలో మిషిగన్‌లో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఫెయిత్‌ హార్న్‌కు చెందిన థియా చేజ్‌ అనే రెండేళ్ల బాలిక బుధవారం రాత్రి 8 గంటలప్పుడు ఇంటి నుంచి కనిపించకుండాపోయింది. ఆమె వెంట రెండు కుక్కలు కూడా ఉన్నాయి. విషయం తెలిసిన పోలీసులు స్థానికులతో కలిసి పరిసర అటవీప్రాంతంలో భారీగా అన్వేషణ మొదలుపెట్టారు.

ఆల్‌ టెర్రయిన్‌ వెహికిల్‌(ఏటీవీ), డ్రోన్లు, పోలీసు జాగిలాలతో కొన్ని గంటల పాటు గాలించారు. చివరికి వారి ఇంటి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో థియా ఉన్న విషయాన్ని ఏటీవీ పసిగట్టింది. పోలీసులు వెళ్లే సరికి ఓ చోట వెంట ఉన్న ఒక శునకాన్ని దిండుగా చేసుకుని చిన్నారి నిద్రిస్తుండగా, మరో జాగిలం అప్రమత్తంగా కాపలా కాస్తూ ఉండటం కనిపించింది. ఈ దృశ్యం చూసి పోలీసులు ఆశ్చర్యపోయారు.

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)