Breaking News

USA: రెండు రాష్ట్రాల్లో కార్చిచ్చు బీభత్సం

Published on Mon, 09/09/2024 - 13:01

వాషింగ్టన్‌: అమెరికాలో రెండు రాష్ట్రాల్లో కార్చిచ్చు వేగంగా వ్యాపిస్తోంది. కాలిఫోర్నియా, నెవాడల్లో వేలాది ఎకరాలను కార్చిచ్చు మంటలు దహించివేస్తున్నాయి. దీంతో రెండు రాష్ట్రాల గవర్నర్లు అత్యవరస్థితి ప్రకటించారు. దక్షిణ కాలిఫోర్నియాలోని శాన్‌ బెర్నార్డినో కౌంటీలో ఒక్కరోజులోనే 20,553 ఎకరాల విస్తీర్ణంలో చెట్లను కార్చిచ్చుకాల్చి బూడిద చేసింది.

మంటల భయంతో చాలా మంది కార్చిచ్చు ప్రాంతాలను వదిలి వెళ్లిపోతున్నారు.  కార్చిచ్చు ప్రభావంతో ఈ ప్రాంతంలో అధిక ఉష్ణోగ్రత నమోదువుతోంది. ఆదివారం(సెప్టెంబర్‌ 8) రాత్రికి రాత్రే  కార్చిచ్చు భారీగా విస్తరించింది. కార్చిచ్చును అదుపు చేసేందుకు వందలకొద్ది అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నారు. అయినా ఏ మాత్రం ప్రయోజనం లేకుండా పోయింది. 

కార్చిచ్చు శరవేగంగా వ్యాపిస్తుండడంతో గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌ అత్యవసర స్థితి ప్రకటించారు. కార్చిచ్చును అరికట్టేందుకు అగ్నిమాపక శాఖకు అదనపు సిబ్బంది, నిధులు, పరికరాలను అందజేశారు. గ్రీన్‌ వ్యాలీ, సీడర్‌ గ్లెన్‌, లేక్‌యారో హెడ్‌, క్రిస్ట్‌లైన్‌, వ్యాలీ ఆఫ్‌ ఎన్‌క్యాచ్‌మెంట్‌లను ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

బేస్‌లైన్‌, అల్పిన్‌ స్ట్రీట్‌ వద్ద గురువారం రాత్రి అడవిలో పిడుగు పడడం వల్ల కార్చిచ్చు ప్రారంభమైనట్లు భావిస్తున్నారు. ఆ తర్వాత గాలి తోడవడంతో ఇది తీవ్రరూపం దాల్చింది. శుక్రవారం మూడు వేల ఎకరాలు, శనివారం ఏడు వేల ఎకరాలను కాల్చి బూడిద చేసింది. మరోవైపు నెవాడ రాష్ట్రంలో కూడా కార్చిచ్చుల కారణంగా అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు గవర్నర్‌ జోయి లాంబర్డో  ప్రకటించారు. 

ఇదీ చదవండి.. మూడేళ్ల చిన్నారిని రక్షించడంలోడ్రోన్‌ సాయం

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)