Breaking News

విపత్తులు వచ్చి.. 'లైఫ్‌ పాడ్‌' అవకుండా..

Published on Thu, 07/16/2026 - 04:45

సునామీలు ముంచెత్తినా.. భూకంపాలు భయపెట్టినా బిందాస్‌గా ఉండొచ్చు.. బుల్లెట్లు కాల్చినా.. బాంబులు పేల్చినా.. బాల్టీ తన్నేయకుండా బేఫికర్‌గా జీవించొచ్చు..

అది అవదమ్మ అంటారా.. అలా అవ్వాలంటే మీరా డబ్బులు ఖర్చు పెట్టి.. ముందు ఓ లైఫ్‌ పాడ్‌ను కొనాలి.. ఇంతకీ ఏంటిది? 

యుద్ధ పరిస్థితులు, ఉగ్రదాడులు, వరదలు, సునామీలు, భూకంపాలు.. ఇలా ప్రకృతి లేదా మానవుడు సృష్టించిన ఉత్పాతాల నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు ఫ్రాన్స్‌కు చెందిన మొమెంటం టెక్నాలజీస్‌ సంస్థ ‘లైఫ్‌ పాడ్‌’లను అభివృద్ధి చేసింది. వీటిని అత్యంత బలమైన లోహాలతో తయారుచేశారు. తరలించడం కూడా తేలిక. పైగా.. వివిధ రకాల విపత్తులకు అనుగుణంగా మూడు రకాల పాడ్‌లను రూపొందించారు. 

డబ్ల్యూ–1 
ఆకస్మిక వరదలు, ఆనకట్టలు తెగిపోవడం, సునామీలు వంటి వాటి కోసం తయారుచేశారు. ఇది తేలియాడే క్యాప్సూల్‌లాంటిది. ఇద్దరు నుంచి నలుగురు ఉండొచ్చు. నీళ్లలో వినియోగానికి అనుగుణంగా దీన్ని అత్యంత మన్నికైన అల్యూమినియంతో చేశారు. పెద్ద పెద్ద శిథిలాల్ని ఢీకొట్టినా తట్టుకుంటుంది. ప్రస్తుతం ఇది తుది దశలో ఉందని కంపెనీ తెలిపింది. దీని ధర రూ.38 నుంచి 45 లక్షల దాకా ఉండే అవకాశముంది.  

బీ–1 
ఉగ్రదాడులు లేదా ప్రమాదాల నుంచి రక్షణ కల్పించేలా దీన్ని రూపొందించారు. ఇద్దరు ఉండొచ్చు. ప్రమాదం జరిగిన క్షణాల్లోనే దీని లోపలికి వెళ్లి లాక్‌ చేసుకునేలా తయారుచేశారు. పరిశ్రమలు, భద్రత దళాలు ఉండే ప్రాంతాల్లో వినియోగానికి అనుకూలంగా ఉంటుంది. ప్రొటోటైపు రెడీగా ఉంది. దీని ధర రూ.32 లక్షలు. 

క్యూ–1 
భూకంపాలు, భవనాలు కూలిపోవడం వంటి ప్రమాదాల్లో ప్రాణాలకు కాపాడేందుకు దీన్ని తయారుచేశారు. ఇల్లు లేదా అపార్టుమెంటు నుంచి బయటకు వచ్చే అవకాశం లేని పరిస్థితుల్లో ఇది రక్షణ కవచంలా నిలుస్తుంది. ఇద్దరు లేదా ముగ్గురు ఉండొచ్చు. దీని ధర ఇంకా ప్రకటించలేదు. ఇటీవల పారిస్‌లో జరిగిన వివాటెక్‌ ప్రదర్శనలో ఈ మూడు లైఫ్‌ పాడ్‌లను కంపెనీ అధినేత సెడ్రిక్‌ ఆవిష్కరించారు.  

అయితే ఇవన్నీ ఉన్నా.. ప్రాణాలు పోతేనో అని మూల‘శంక’ మాస్టారు ఒకరు డౌట్‌ రైజ్‌ చేశాడు.. 
అంతే.. సెడ్రిక్‌.. ఆ ఒక్క మాటతో లేచి..  రెండు చేతులూ జేబులో పెట్టుకుని  అలా నడుచుకుంటూ.......    

– సాక్షి, సెంట్రల్‌ డెస్క్‌ 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)