Breaking News

పడవ బోల్తా పడి 21 మంది మృతి

Published on Sun, 11/08/2026 - 15:57

పశ్చిమ ఆఫ్రికా దేశమైన సెనెగల్‌ తీరంలో వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. గల్లంతైన వారి కోసం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

సెనెగల్‌ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. దేశ వాయవ్య ప్రాంతంలోని కెబెమెర్‌ తీరానికి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. వలసదారులు ప్రయాణిస్తున్న సంప్రదాయ ఫిషింగ్‌ పడవ (పిరోగ్‌) సముద్రంలో ప్రమాదానికి గురైంది. ప్రమాద సమయంలో పడవలో ఎంతమంది ఉన్నారనే వివరాలను అధికారులు వెల్లడించలేదు.

ఈ ఘటనపై సెనెగల్‌ ప్రభుత్వం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అధ్యక్షుడు, ప్రభుత్వం తరఫున అంతర్గత వ్యవహారాలు, ప్రజా భద్రత మంత్రి మృతులకు నివాళులర్పించారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మనుషుల అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాలపై పోరాటాన్ని మరింత బలోపేతం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు పొరుగు దేశాలతో కలిసి పనిచేస్తామని ప్రకటించింది.

ప్రమాదకర మార్గం
ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ వలసల సంస్థ (ఐఓఎం) తెలిపిన వివరాల ప్రకారం.. పశ్చిమ ఆఫ్రికా నుంచి యూరప్‌కు వెళ్లే వలసదారులకు అట్లాంటిక్‌ సముద్ర మార్గం ప్రధాన ప్రయాణ మార్గాల్లో ఒకటి. అయితే ఇది అత్యంత ప్రమాదకరమైనది. సెనెగల్‌, మొరాకో, మౌరిటానియా దేశాల్లో వలసదారుల ప్రయాణాలపై నిఘా, నియంత్రణలు పెరగడంతో కొందరు వలసదారులు దక్షిణం వైపు ఉన్న గాంబియా వంటి దేశాల నుంచి ప్రయాణం ప్రారంభిస్తున్నారు.

దీనివల్ల సముద్ర ప్రయాణ దూరం మరో 750 కిలోమీటర్ల వరకు పెరుగుతోంది. కొన్ని ప్రయాణాలు సుమారు 2,200 కిలోమీటర్లకు చేరుకుంటున్నాయి. ఎక్కువ సమయం సముద్రంలో గడపాల్సి రావడం, నిఘా తక్కువగా ఉండే మారుమూల తీర ప్రాంతాల గుండా వెళ్లడం వల్ల పడవ ప్రమాదాలు, నీటి కొరత, గల్లంతయ్యే ముప్పు పెరుగుతోందని ఐఓఎం హెచ్చరించింది. సెనెగల్‌ తీరంలో తాజా ప్రమాదం నేపథ్యంలో గల్లంతైన వారి ఆచూకీ, మృతుల పూర్తి వివరాలు, పడవలో ప్రయాణించిన వారి సంఖ్యపై అధికారుల తదుపరి ప్రకటనలపై దృష్టి నెలకొంది.

#

Tags : 1

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)