Breaking News

ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలో ఆకస్మిక వరదలు

Published on Thu, 11/27/2025 - 05:46

మెడాన్‌: ఇండోనేషియాలోని సుమత్రా ప్రావిన్స్‌లో ఆకస్మిక వరదలు, కొండ చరియలు విరిగి పడటంతో 17 మంది మరణించారు. ఆరుగురు గల్లంతయ్యారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ప్రధాన వంతెనలు ధ్వంసమయ్యాయి. పలు జిల్లాల్లో వేలాది ఇళ్లు ప్రభావితమయ్యాయి. బురద, శిథిలాల కారణంగా ప్రధాన రహదారులు మూసుకుపోయాయి. 

ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీస్తుండగా, పైకప్పుల నుంచి నీరు ప్రవహిస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నా3యి. కొండ చరియలు విరిగిçపడి, బురద, రాళ్లు పేరుకుపోవడంతోపాటు చెట్లు కూలిపోవడంతో సహాయకచర్యలకు ఆటంకం కలుగుతోంది. బుధవారం నాటికి సిబోల్గానగరంలో ఐదు మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికి తీసింది. గాయపడిన మరో ముగ్గురిని కాపాడింది. గల్లంతైన మరో నలుగురి కోసం అన్వేషణ కొనసాగుతోంది. పక్కనే ఉన్న తపనులి జిల్లాలో కొండ చరియలు విరిగిపడటంతో ఒక కుటుంబంలోని నలుగురు మరణించారు. 

వరదల దాటికి 2వేల ఇళ్లు ప్రభావితమయ్యాయి. ఇదే జిల్లాలో మరో ఎనిమిది మంది మృతదేహాలను వెలికి తీశారు. 2,800 మందికి పైగా పునరావాస కేంద్రాలకు తరలించారు. తాత్కాలిక పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, అధిక ప్రమాద మండలాల్లో ఉన్న ప్రజలు వెంటనే ఖాళీ చేయాలని సిబోల్గా పోలీస్‌ చీఫ్‌ సూచించారు. మరిన్ని కొండ చరియలు విరిగిపడే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.

 అంతకుముందు భారీ వర్షాల కారణంగా ఇండోనేషియాలోని మరో ద్వీపం జావాలోనూ పది రోజులపాటు సహాయక చర్యలు కొనసాగాయి. కొండచరియలు విరిగిపడి 38 మంది మరణించారు. వారిలో 13 మంది ఆచూకీ తెలియలేదు. ఇది కొనసాగుతుండగానే మంగళవారం సిబోల్గా, తపనులితోపాటు పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. అక్టోబర్‌ నుంచి మార్చి వరకు కురిసే భారీ వర్షాల వల్ల ఇండోనేషియాలో వరదలు, కొండ చరియలు విరిగిపడటం జరుఉగతుంది. ఇది 17వేల ద్వీపసమూహం. ఇక్కడ లక్షలాది మంది ప్రజలు పర్వత ప్రాంతాల్లో నివసిస్తుంటారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)