Breaking News

విరిగిపడ్డ కొండచరియలు.. భారీగా ప్రాణనష్టం

Published on Fri, 05/24/2024 - 15:52

పోర్ట్‌మోర్స్బీ: పపువా న్యూ గినియాలో ప్రకృతి ఆగ్రహించింది. రాజధాని పోర్ట్‌ మోర్స్బీకి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎన్గా ప్రావిన్స్‌లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో వందల మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో పౌరులు గాయపడ్డారు.  ఈ విషయాన్ని  ఆస్ట్రేలియా అధికారిక మీడియా వెల్లడించింది. 

తెల్లవారుజామున 3 గంటలకు కొండచరియలు ఒక్కసారిగా విరిగి కింద ఉన్న ఆరు గ్రామాలపై పడ్డాయి. పెద్ద సైజు రాళ్లు పడి గ్రామాల్లోని చాలావరకు ఇళ్లు నేలమట్టమయ్యాయి. ప్రజలు నిద్రలో ఉన్నపుడు ఇళ్లపై పెద్ద సైజు కొండ రాళ్లు పడటంతో భారీగా ప్రాణనష్టం వాటిల్లింది. ఘటన జరిగిన తర్వాత స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

కొండ రాళ్ల కింద శిథిలాలు భారీగా కూరుకుపోవడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 100కు పైగా మృతదేహాలను వెలికితీశారు. కొండ రాళ్లు విరిగిపడిన గ్రామానికి పోలీసులు, సహాయక బృందాలు ఇంకా చేరుకోలేదని తెలుస్తోంది. మృతుల సంఖ్యపై న్యూగినియా ప్రభుత్వం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)