Breaking News

అవి క్రిస్మస్‌ పక్షులు.. వాటి కువకువలు సుమధుర సరాగాలు

Published on Tue, 12/24/2024 - 10:35

పక్షుల కిలకిలారావాలు ఎవరినైనా మైమరపిస్తాయి. ఇక వాటి రూపం కూడా అమితంగా ఆకట్టుకుంటుంది. ఉత్తర అమెరికాలో క్రిస్మస్ సీజన్లో అందమైన వెర్మిలియన్ పక్షులు సందడి చేస్తుంటాయి. అందుకే వాటిని క్రిస్మస్‌ పక్షులని అంటారు. ఇవి ఎరుపురంగులో ఆకర్షణీయంగా ఉంటాయి.

ఈ పక్షులను కార్డినల్స్ లేదా నార్తర్న్ కార్డినల్స్ అని కూడా పిలుస్తారు. క్రిస్మస్ రోజుల్లో ఈ పక్షులు తమ కువకువలను శ్రావ్యంగా వినిపిస్తాయి. ఈ పక్షులలోని ఆడ, మగ పక్షుల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తుంది.

నార్తర్న్ కార్డినల్స్  మగ, ఆడ పక్షుల మధ్య ప్రధాన వ్యత్యాసం వాటి రంగు. మగవెర్మిలియన్ ఎరుపు రంగులో ఉండగా, ఆడవి గోధుమ లేదా బూడిద రంగులో ఉంటాయి. వాటి తోక, శరీరంలోని కొన్ని భాగాలు ఎరుపు రంగులో ఉంటాయి. ఈ పక్షులు పసుపు, తెలుపు రంగులలోనూ కనిపిస్తాయి.

కార్డినల్స్ లేదా నార్తర్న్ కార్డినల్స్ వాటి ఈకల నుండి ఎరుపు రంగును స్వీకరిస్తాయి. వాటి తోక, ముక్కు కూడా ఎరుపు రంగులో ఉంటాయి. అవి తాము తినే ఆహరం నుంచి ఇటువంటి రంగును పొందుతాయి.  ఇవితినే ఆహారంలోని కెరోటినాయిడ్లు వీటికి ఎరుపు, నారింజ, పసుపు, గులాబీ రంగులను అందిస్తాయి. ఈ రంగులన్నీ వాటి ఈకలలో ప్రతిబింబిస్తాయి. ఆడపక్షులలో ఎరుపు రంగుకు బదులుగా, పసుపు  బూడిద రంగు ఎక్కువగా కనిపిస్తుంది. ఎరుపు రంగు తక్కువగా ఉంటుంది.

నార్తర్న్ కార్డినల్స్ ప్రత్యేకత ఏమిటంటే వీటి కిలకిలారావాలు పాటల మాదిరిగా వినిపిస్తాయి. అవి భూమిపైకి దిగి పరిగెత్తేటప్పుడు కిలకిలారావాలు చేస్తాయి. ఆడ, మగ రెండూ పాడతాయి. అవి 24 రకాలుగా కిలకిలారావాలు చేస్తాయని పరిశోధనల్లో తేలింది.

కార్డినల్స్ జీవితాంతం ఒక భాగస్వామితోనే కలసి ఉంటాయి.  ఎప్పుడూ కలసే కనిపిస్తాయి. కలిసి గూడు కట్టుకుంటాయి. అయితే గుడ్లు పెట్టిన తర్వాత మగ పక్షులు గూడుకు దూరంగా ఉంటాయి.  తరువాత ఆరెండూ తమ పిల్లపక్షులను ఎంతో శ్రద్ధగా పెంచుతాయి. వాటికి ఆహారం అందిస్తాయి.

ఆడ కార్డినల్స్ ఎక్కువగా కిలకిలారావాలు చేస్తాయి. వేటగాళ్ళు తమ గూడును గుర్తించకుండా  ఉండేందుకే 
అవి సందడి చేస్తాయని పరిశోధనల్లో తేలింది.  అలాగే మగపక్షితో ఆహారం తీసుకురమ్మని చెప్పేందుకు అవి ప్రత్యేక శబ్దాలు కూడా చేస్తాయి.

కొన్నిసార్లు ఈకలు లేని కార్డినల్స్‌ కూడా  కనిపిస్తాయి. అవి ప్రతి సంవత్సరం తమ ఈకలను తొలగిస్తాయి. ఆ తర్వాత పాత వాటి స్థానంలో కొత్త ఈకలు వస్తాయి. ఈ మధ్య నుండే సమయంలో అవి ఈకలు లేని పక్షులుగా కనిపిస్తాయి.

 

Videos

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)