కిస్కా కథ అలా ముగిసింది..!

Published on Mon, 03/27/2023 - 05:18

ఒంటారియో: కిస్కా. ఓర్కా రకం కిల్లర్‌ వేల్‌. ప్రపంచంలోనే అత్యంత ఒంటరి తిమింగలం. దాదాపు 40 ఏళ్లపాటు నీళ్ల ట్యాంకులో ఒంటరిగా బతుకీడ్చింది. చోటు మార్చాలని జంతువుల హక్కుల సంఘాలు చేసిన ప్రయత్నాలు విఫలం కాగా, అనారోగ్యంతో ఇటీవలే కన్నుమూసింది. ఐస్‌ల్యాండ్‌ సమీపంలోని సముద్ర జలాల్లో ఏడేళ్ల వయస్సున్నప్పుడు ఈ కిల్లర్‌ వేల్‌ పట్టుబడింది. దీనిని ఒంటారియోలోని నయాగరా జలపాతం వద్ద ఉన్న మెరైన్‌ల్యాండ్‌ జూ పార్క్‌కు అమ్మేశారు.

40 ఏళ్ల పాటు కిస్కా ఓ నీళ్ల ట్యాంకుకే పరిమితమైపోయింది.ప్రపంచంలోనే అత్యంత ఒంటరి తిమింగలంగా ముద్రపడింది. ఇటీవలే సుమారు 47 ఏళ్ల వయస్సులో కిస్కా చనిపోయింది. ‘కిస్కా మృతి పట్ల విచారిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఓర్కా రకం తిమింగలాలు బందీలుగా ఉన్నాయి. కెనడా ప్రభుత్వం నోవాస్కోటియాలో వందెకరాల్లో వేల్‌ శాంక్చువరీ ప్రాజెక్టు ఏర్పాటు పనుల్లో ఉంది. ఇది పూర్తయితే ట్యాంకుల్లో కన్నా స్వేచ్ఛగా, మెరుగైన సురక్షిత వాతావరణంలో పట్టుబడిన తిమింగలాలు, డాల్ఫిన్లను ఉంచడానికి అవకాశం ఏర్పడుతుంది’అని ఏనిమల్‌ జస్టిస్‌ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కెమిల్లె లబ్చుక్‌ అన్నారు. తిమింగలాల్లో అత్యంత బలమైన ఈ ఓర్కాల ఆయుర్ధాయం 50 నుంచి 90 ఏళ్లు.

Videos

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

Photos

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)