Breaking News

2026కు విశ్వమానవాళి వెల్‌కమ్‌ 

Published on Thu, 01/01/2026 - 05:13

మెల్‌బోర్న్‌/న్యూఢిల్లీ: కొత్త ఆశలను మోసుకొచ్చిన నూతన సంవత్సరానికి ప్రపంచదేశాలు ఆనందోత్సాహల నడుమ సాదర స్వాగతం పలికాయి. నూతన సంవత్సరం సందర్భంగా అర్ధరాత్రి న్యూయార్క్‌లోని టైమ్స్‌ స్క్వేర్‌లో అత్యంత ఆడంబరంగా జరిగే బాల్‌ డ్రాప్‌ వేడుక కంటే 18 గంటలు ముందుగానే దక్షిణ పసిఫిక్‌ మహాసముద్రంలోని కిరిటిమాటి ద్వీపవాసులు నూతన ఏడాది వేడుకలను జరుపుకున్నారు. 

స్థానికకాలమానం ప్రకారం కొత్త ఏడాది అన్నిదేశాలకంటే ముందుగా అక్కడే మొదలైంది. ఏటా డిసెంబర్‌ 31 అర్ధరాత్రి ఆ్రస్టేలియాలోని సిడ్నీ నగర హార్బర్‌ బ్రిడ్జిపై కన్నులపండువగా జరిగే బాణసంచా షోను చూసేందుకు జనం ఈసారి సైతం తండోపతండాలుగా తరలివచ్చారు. అయితే రెండు వారాల క్రితం బాండీ బీచ్‌ వద్ద ఇద్దరు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 15 మంది ప్రాణాలు కోల్పోవడంతో ఈసారి జనసమ్మర్ధ ప్రాంతాల్లో ఆ్రస్టేలియాపోలీసులు మునుపెన్నడూ లేనంతగా మొహరించారు. 

చాలా మంది పోలీస్‌ అధికారులు తొలిసారిగా ర్యాపిడ్‌ఫైర్‌ రైఫిళ్లను వెంటేసుకుని తిరిగారు. న్యూజిలాండ్‌లోని అక్లాండ్‌ సిటీలో ప్రఖ్యాత స్కై టవర్‌పై పేల్చిన బాణసంచా అక్కడి వారికి కనువిందుచేసింది. ఆ్రస్టేలియా సమీప ఇండోనేసియాలోనూ సంబరాలు అంబరాన్నంటాయి. నెల క్రితమే వేయి మందికిపైగా ప్రజలను వరదలు కబళించిన బాధ నుంచి జనం తేరుకుని కొత్త ఏడాది వేడుకల్లో మునిగిపోయారు. 

అయితే ఇండోనేసియాలోని బాలీలో మాత్రం భారీ వేడుకలను ఈసారి రద్దుచేశారు. జపాన్‌లో జనం కొత్త ఏడాది గంట కొట్టగానే బౌద్ధారామాలను దర్శించుకున్నారు. దక్షిణ కొరియా, సింగపూర్‌ వాసులూ తమదైన శైలిలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. జర్మనీలోని బెర్లిన్‌ నగర క్యాథడ్రల్, ప్రఖ్యాత బ్రాండెన్‌బర్గ్‌ గేటు వద్ద జనం పోగై ఒకరికొకరు నూతన సంవత్సర శుభకాంక్షలు చెప్పుకున్నారు. భారత్‌లో ఊరూవాడా జనం సంబరాల్లో మునిగిపోయారు. 
 

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు