Breaking News

రష్యాలో కిమ్‌ జోంగ్‌ ఉన్‌ బిజీబిజీ

Published on Sun, 09/17/2023 - 05:27

సియోల్‌: ఉత్తర కొరియా నియంత కిమ్‌ జోంగ్‌ ఉన్‌ రష్యా పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఆయన శనివారం రష్యా ఆయుధాగారాన్ని సందర్శించారు. రష్యా అభివృద్ధి చేసిన అణ్వస్త్ర సహిత బాంబర్లు, హైపర్‌సానిక్‌ క్షిపణులు, అత్యాధునిక యుద్ధ నౌకను పరిశీలించారు. కిమ్‌ తొలుత ఉత్తర కొరియా నుంచి రైలులో అరి్టయోమ్‌ సిటీకి చేరుకున్నారు. ఇక్కడికి సమీపంలోని ఎయిర్‌పోర్టులో రష్యాకు చెందిన వ్యూహాత్మక బాంబర్లు, యుద్ధ విమానాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కిమ్‌ వెంట రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు ఉన్నారు.

టు–160, టు–95–, టు–22 బాంబర్ల గురించి కిమ్‌ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. మిగ్‌–31 ఫైటర్‌ జెట్‌ నుంచి ప్రయోగించే హైపర్‌సానిక్‌ కింజాల్‌ క్షిపణుల గురించి కిమ్‌కు సెర్గీ వివరించారు. ఇలాంటి క్షిపణులను ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా సైన్యం ప్రయోగిస్తోంది. కిమ్, సెర్గీ షోయిగు కలిసి రేవు నగరం వ్లాదివోస్తోక్‌ చేరుకున్నారు. ఇక్కడ అత్యాధునిక యుద్ధ నౌకలను, ఆయుధాలను కిమ్‌ పరిశీలించారు. ఆయుధాలు, ఉపగ్రహాల తయారీ విషయంలో రష్యా నుంచి ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికే కిమ్‌ రష్యాలో పర్యటిస్తున్నట్లు పశి్చమ దేశాలు అంచనా వేస్తున్నాయి.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)