Breaking News

కేన్సర్‌ నుంచి బయటపడ్డాను: కేట్‌ మిడిల్టన్‌

Published on Thu, 01/16/2025 - 06:12

లండన్‌: తాను కేన్సర్‌ను జయించానని బ్రిటన్‌ యువరాణి కేట్‌ మిడిల్టన్‌ ప్రకటించారు. తనకు కేన్సర్‌ చికిత్స అందించిన లండన్‌లోని రాయల్‌ మార్స్‌డెన్‌ ఆసుపత్రిని మంగళవారం ఆమె సందర్శించారు. గత ఏడాది కాలంగా తనను సేవలందించిన నేషనల్‌ హెల్త్‌ సర్విస్‌ (ఎన్హెచ్‌ఎస్‌) సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ఈ ఏడాది కాలంగా విలియం, నాతో కలిసి నిశ్శబ్దంగా నడిచిన వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 

ఒక రోగిగా ఈ కాలంలో నేను అసాధారణమైన సంరక్షణ, సలహాలు పొందాను. ఎంతో ఉపశమనం పొందాను. కేన్సర్‌ను అనుభవించినవారికే ఇది తులుస్తుంది. ఇప్పుడు కోలుకోవడంపై దృష్టి పెట్టాను. ఈ సంవత్సరం గొప్పగా ఉంటుందని ఆశిస్తున్నా’’అని కేట్‌ ప్రకటించారు. మార్చిలో తాను కేన్సర్‌కు కీమో థెరపీ చికిత్స చేయించుకున్నట్లు కేట్‌ వెల్లడించారు. 

గత గురువారం 43వ పుట్టిన రోజు జరుపుకొన్న కేట్‌.. ‘‘అద్భుతమైన భార్య, తల్లి. గత ఏడాది కాలంగా మీరు చూపించిన బలం అమోఘం’’అని ప్రిన్స్‌ విలియం ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. ప్రపంచంలోనే మొట్టమొదటి కేన్సర్‌ ఆసుపత్రిగా రాయల్‌ మార్స్‌డెన్‌ను 1851లో ప్రారంభించారు. దీనికి బ్రిటన్‌ రాజవంశీయులు దాతలుగా ఉన్నారు. దీనికి 2007 నుంచి ప్రిన్స్‌ విలియం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. గతంలో వేల్స్‌ యువరాణి అయిన అతని తల్లి డయానా ఈ పాత్రను నిర్వహించారు.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)