Breaking News

Kate Middleton: నేను కేన్సర్‌తో పోరాడుతున్నా..

Published on Sat, 03/23/2024 - 08:02

బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌ పెద్ద కోడలు, ప్రి‍న్స్‌ విలియమ్‌ సతీమణి.. వేల్స్‌ యువరాణి కేట్‌ మిడిల్టన్‌/కేథరిన్‌ (Princess Catherine) ఎట్టకేలకు ప్రజల ముందుకు వచ్చారు. అయితే.. తాను కేన్సర్‌తో పోరాడుతున్నానని సంచలన ప్రకటన చేశారామె. ఈ మేరకు 42 ఏళ్ల కేట్‌ స్వయంగా ఆ వీడియో సందేశంలో తన అనారోగ్యం వివరాలను ఆమె తెలియజేశారు. 

పొత్తికడుపు సర్జరీ తర్వాత జరిగిన పరీక్షల్లో నాకు కేన్సర్‌ సోకిందని నా వైద్య బృందం చెప్పింది. కీమోథెరపీ కోర్సు యించుకోవాలని సలహా ఇచ్చింది.  ‍ప్రస్తుతం ఆ చికిత్స యొక్క ప్రారంభ దశలో ఉంది అని ఆమె తెలిపారు. ఇది మా కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురి చేసే విషయం. అయినప్పటికీ ధైర్యంగా కేన్సర్‌తో పోరాడాలనుకుంటున్నా. నా భర్త విలియమ్‌ సహకారంతో చేయాల్సిందంతా చేస్తాం.  ఈ సమయంలో మా కుటుంబ ప్రైవసీకి భంగం కలగకుండా చూడాలని కోరుకుంటున్నాం అని ఆమె వీడియో సందేశంలో విజ్ఞప్తి చేశారు. 

ఇదిలా ఉంటే.. బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌(75) సైతం కేన్సర్‌ బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన చికిత్స పొందుతున్నారని ఫిబ్రవరిలో బకింగ్‌హమ్‌ ప్యాలెస్‌ ప్రకటించింది కూడా. ఈలోపు బ్రిటన్‌ యువరాణి కేట్‌ సైతం కేన్సర్‌ బారిన పడిందన్న విషయం బ్రిటన్‌ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఇదిలా ఉంటే.. 2011లో విలియమ్‌తో కేట్‌ మిడిల్టన్‌ వివాహం జరిగింది. వీళ్లకు ముగ్గురు సంతానం.

అప్పటి నుంచి.. 
బ్రిటన్‌ యువరాణి కేట్‌ మిడిల్టన్‌ డిసెంబర్‌ నుంచి కనిపించకుండా పోవడంతో రకరకాల  ప్రచారాలు చక్కర్లు కొట్టాయి. ఆమె పొత్తి కడుపు సర్జరీ చేయించుకున్నారని, కోమాలోకి వెళ్లారంటూ ఏవేవో ప్రచారాలు జరిగాయి. ఆపై ఆమె ఎక్స్‌ ఖాతాలో పిల్లలతో ఓ ఫొటోను రిలీజ్‌ చేయగా.. అక్కడి మీడియా ఛానెల్స్‌ విశ్లేషణ అనంతరం ఆ తర్వాత అది ఎడిటెడ్‌ ఫొటో అని తేలింది. దీంతో రాజప్రసాదం క్షమాపణలు తెలిపింది.  దీంతో ఆమెకు ఏదో జరిగిందంటూ ప్రచారాలకు బలం చేకూరింది.

కోలుకోవాలని సందేశాలు.. హ్యరీ దంపతులు కూడా
ఇదిలా ఉంటే.. కేట్‌ మిడిల్టన్‌  కేన్సర్‌ బారి నుంచి త్వరగా కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా సందేశాలు వ్యక్తం అవుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడన్‌తో పాటు బ్రిటన్‌ రాజకీయ ప్రముఖులు సందేశాలు పంపారు. మరోవైపు ఛార్లెస్‌ చిన్న కొడుకు ప్రిన్స్‌ హ్యారీ, అతని భార్య మేఘన్‌ మార్కెల్‌ సైతం కేట్‌ త్వరగా కోలుకోవాలంటూ ఓ సందేశం పంపించారు. కుటుంబ కలహాలతో 2020లో రాజరికాన్ని, బ్రిటన్‌ను వదిలేసి హ్యారీ-మార్కెల్‌ జంట కాలిఫోర్నియాకు వెళ్ల స్థిరపడింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)