Breaking News

జాక్‌పాట్‌ తగిలింది.. లాటరీలో రూ.49కోట్లు సొంతం చేసుకున్నాడు

Published on Thu, 02/05/2026 - 22:00

అబుదాబిలో నిర్వహించిన బిగ్ టికెట్ లాటరీ డ్రాలో కర్ణాటకకు చెందిన వ్యక్తి అదృష్టవంతుడిగా నిలిచారు. ఆయన రూ.49 కోట్ల జాక్‌పాట్‌ను గెలుచుకున్నాడు.  

అబుదాబి అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్వహించిన బిగ్ టికెట్ లాటరీ డ్రాలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన శంతను శెట్టిగర్‌ అదృష్టవంతుడిగా నిలిచారు. ఆయన టికెట్ నంబర్ ఎంపిక కావడంతో రూ.49 కోట్లను(AED 22 మిలియన్) సొంతం చేసుకున్నారు.

కర్ణాటకకు చెందిన శంతను గల్ఫ్‌లో ఉద్యోగం చేస్తూ, తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి లాటరీ టికెట్ కొనుగోలు చేశారు. అనుకోకుండా ఆయన టికెట్ నంబర్ డ్రాలో ఎంపిక కావడంతో ఆయన జీవితం మలుపు తిరిగింది.

విజయం తెలిసిన వెంటనే ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆనందంలో మునిగిపోయారు. ఇది మా జీవితాన్ని పూర్తిగా మార్చేసిన క్షణం. ఈ డబ్బుతో కుటుంబానికి భద్రత కల్పిస్తాం, సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తాం’అని ఆయన భావోద్వేగంగా తెలిపారు.

1992లో అబుదాబి విమానాశ్రయంలో ప్రారంభమైన ఈ లాటరీ, గల్ఫ్‌లో అత్యంత ప్రజాదరణ పొందింది. ప్రతి నెలా కోట్ల రూపాయల విలువైన జాక్‌పాట్‌తో పాటు లగ్జరీ కార్లు, ఇతర బహుమతులు అందజేస్తారు.గతంలో కూడా అనేక భారతీయులు ఈ లాటరీలో భారీ మొత్తాలు గెలుచుకున్నారు. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వారు ఎక్కువగా పాల్గొంటారు.

ఈ విజయం కర్ణాటకలోని ఆయన గ్రామం ఉడిపికి గర్వకారణమైంది. స్థానికులు మన ప్రాంతం నుంచి అంత పెద్ద మొత్తాన్ని గెలుచుకోవడం గొప్ప విషయం  అని ఆనందం వ్యక్తం చేశారు. గల్ఫ్‌లో పనిచేస్తున్న భారతీయ కార్మికులకు ఇది ఒక ఆశాకిరణంలా మారింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)