Breaking News

నేపాల్‌ నూతన ప్రధానిగా కేపీ శర్మ ఓలి

Published on Mon, 07/15/2024 - 06:31

కఠ్మాండు: నేపాల్‌ ప్రధానమంత్రిగా ఖడ్గ ప్రసాద్‌ శర్మ ఓలి నాలుగోసారి నియమి తులయ్యారు. ఆదివారం అధ్యక్షుడు రాం చంద్ర పౌడెల్‌ ఆయన్ను ప్రధానిగా నియమించారు. కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ నేపాల్‌– యూనిఫైడ్‌ మార్క్సిస్ట్‌ లెనినిస్ట్‌ (సీపీఎన్‌–యూఎంఎల్‌)–నేపాలీ కాంగ్రెస్‌(ఎన్‌సీ)లతో కొత్తగా ఏర్పాటైన సంకీర్ణ ప్రభుత్వానికి చైనా అనుకూలవాదిగా పేరున్న ఓలి నాయకత్వం వహించనున్నారు. పార్లమెంట్‌లో శుక్రవారం జరిగిన విశ్వాస పరీక్షలో పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండ ఓడిపోవడంతో కొత్త ప్రభుత్వం ఏర్పాటు అనివార్యమైంది. 

ఓలితోపాటు ఆయన మంత్రివర్గం సోమవారం ప్రమాణం చేయనుంది. గతంలో నేపాల్‌ ప్రధానిగా కేపీ శర్మ ఓలి 2015–16, 2018–2021 సంవత్సరాల మధ్యలో పనిచేశారు. అయితే, అప్పటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2021 మే 13వ తేదీన మరోసారి ఓలిని రాష్ట్రపతి బిద్యాదేవి భండారీ ప్రధానిగా నియమించడం వివాదమైంది. ఈ నియమాకం రాజ్యాంగ విరుద్ధమంటూ సుప్రీంకోర్టు తీర్పు వెలువరించడంతో ఓలి అప్పట్లో రాజీనామా చేయాల్సి వచ్చింది. తాజాగా ఏర్పడిన సంకీర్ణంలో మరో ఐదు పార్టీలు చేరే అవకాశాలున్నాయంటున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)