Breaking News

అత్యున్నత స్థానానికి ఎదిగి..  హఠాత్తుగా నిష్క్రమించి

Published on Tue, 06/23/2026 - 04:45

లండన్‌: బారిష్టర్‌ విద్యనభ్యసించి మానవహక్కుల సంబంధ కేసులను విజయవంతంగా వాదించే లాయర్‌గా పేరు తెచ్చుకున్న కీర్‌ స్టార్మర్‌ తదనంతరకాలంలో లేబర్‌ పార్టీ నేతగా, బ్రిటన్‌ ప్రధానిగా సేవలందించి సోమవారం హఠాత్తుగా పదవీబాధ్యతలను త్యజించారు. దీంతో బ్రిటన్‌లో స్టార్మర్‌ మరోసారి పెద్ద చర్చను లేవదీశారు. 2019 డిసెంబర్‌లో దారుణంగా ఓడిపోయిన సొంత లేబర్‌ పార్టీని రెండేళ్ల క్రితం బ్రిటన్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో విజయతీరాలకు చేర్చిన స్టార్మర్‌ ఇప్పుడు అసమర్థ పాలకుడనే ముద్రతో వెనుతిరగడం ఆయన అభిమానులను ఒకింత నిరాశకు గురిచేసింది. 

భారత్‌ను బ్రిటన్‌కు అత్యంత విశ్వసనీయ భాగస్వామిగా భావించే స్టార్మర్‌ ఇరుదేశాల మధ్య చరిత్రాత్మక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(ఎఫ్‌టీఏ)సాకారం కోసం ఎంతగానో కృషిచేశారు. భారత్, బ్రిటన్‌ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 48 బిలియన్‌ డాలర్లకు చేరువవుతున్నవేళ స్టార్మర్‌ లేకపోవడంతో ఇకపై ఇరుదేశాల బంధం ఎలా ఉండబోతోందనే చర్చ సైతం మొదలైంది. స్టార్మర్‌ లండన్‌లో 1962 సెప్టెంబర్‌ రెండోతేదీన జన్మించారు. ఈయన తండ్రి పనిముట్లు తయారుచేసేవాడు. తల్లి నేషనల్‌ హెల్త్‌ సర్వీస్‌(ఎన్‌హెచ్‌ఎస్‌)లో నర్సుగా పనిచేసేది. 

టీనేజర్‌గా ఉన్నప్పుడు ఈయనలో రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉండేది. స్టార్మర్‌ 1985లో లీడ్స్‌ విశ్వవిద్యాలయంలో లా చదివారు. తర్వాత ఆక్స్‌ఫర్డ్‌లోని సెయింట్‌ ఎడ్మండ్‌ హాల్‌లో సివిల్‌ లాలో పీజీ చేశారు. లాయర్‌గా ఎక్కువగా మానవహక్కుల కేసులు వాదించేవారు. 2002లో సీనియర్‌ లాయర్లకు వేదికైన ప్రతిష్టాత్మక క్వీన్‌ కౌన్సిల్‌లో సభ్యత్వం సాధించారు. ప్రభుత్వ విభాగమైన క్వీన్స్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌లో పబ్లిక్‌ ప్రాసిక్యూషన్స్‌ డైరెక్టర్‌గా సేవలందించారు. తొలిసారిగా 2015 సాధారణ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు. బ్రెగ్జిట్‌కు వ్యతిరేకంగా పోరాడారు. 

కార్మీకుల హక్కులు, ఉద్యోగుల పరిరక్షణ కోసం లేబర్‌ పార్టీ తరఫున శ్రమించారు. కోవిడ్‌ సంక్షోభకాలంలో దిగువసభలో విపక్షనేతగా ప్రజల గొంతుక విన్పించారు. బోరిస్‌ జాన్సన్‌ ‘పార్టీగేట్‌’వివాదంపై విమర్శలు గుప్పించి వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. పార్టీ గెలిచాక 2024 జూలైలో క్రితం ప్రధాని అయ్యారు. ప్రభుత్వ అనవసర ఖర్చులను తగ్గించారు. ప్రభుత్వరంగంలో కార్మీకులు, ఉద్యోగులు చేసిన సమ్మెలను విరమించేలా కృషిచేశారు. 

జైళ్లు కిక్కిరిసిపోకుండా తక్కువ నేరాలుచేసిన ఖైదీలను త్వరగా విడుదలచేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. రష్యా యుద్ధంలో ఉక్రెయిన్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. 2024 డిసెంబర్‌లో స్నేహితుడు పీడర్‌ మాండెల్సన్‌కు రాయబారి హోదా కట్టబెట్టడంతో వివాదం మొదలైంది. ఆయనను స్టార్మర్‌ వెనకేసుకొచ్చారని ఆరోపణలొచ్చాయి. స్థానిక ఎన్నికల్లో పార్టీ పేలవ ప్రదర్శనకు స్టార్మర్‌దే బాధ్యత అని అందరూ తిట్టిపోశారు. కొందరు మంత్రులు తమ పదవులకు రాజీనామాలుచేసి తమ నిరసన వ్యక్తంచేశారు.  

పదేళ్లలో ఆరుగురు 
లండన్‌: వివాదాలు, అసమర్థత పాలన, జాతీయ, విదేశాంగ విధానాల్లో లోపాలు, వ్యక్తిగత ప్రతిష్ట మసకబారడం ఇలా పలు కారణాలతో బ్రిటన్‌లో గత పదేళ్లలో ఆరుగురు ప్రధానులు తమ పదవుల్ని కోల్పోయారు. స్టార్మర్‌ సహా గత పదేళ్లలో ఎవరెవరు పదవుల్ని కోల్పోయారంటే...

1. డేవిడ్‌ కామెరాన్‌ (2010 నుంచి 2016) 
2. థెరిసా మే (2016 నుంచి 2019) 
3. బోరిస్‌ జాన్సన్‌(2019 నుంచి 2022) 
4. లిజ్‌ ట్రస్‌ (2022) 
5. రిషి సునాక్‌ (2022 నుంచి 2024) 
6. కీర్‌ స్టార్మర్‌ (2024 నుంచి 2026)  
 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)