Breaking News

అమెరికా అధ్యక్ష బరిలో కమలా హారీస్‌.. హింట్‌ ఇచ్చిన బైడెన్‌!

Published on Wed, 07/17/2024 - 17:21

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల నుంచి జో బైడెన్‌ తప్పుకోవాలనే డిమాండ్‌ వస్తున్న వేళ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. యూఎస్‌ ఉపాధ్యక్షురాలు కమలా హారీస్‌.. అ‍ధ్యక్ష పదవికి అర్హురాలు అంటూ బైడెన్‌ కామెంట్స్‌ చేయడం ఆసక్తికరంగా మారింది. దీంతో, అధ్యక్ష రేసు నుంచి బైడెన్‌ తప్పుకుంటున్నారనే చర్చ మొదలైంది.

కాగా, తాజాగా అధ్యక్షుడు జో బైడెన్‌ నేషనల్‌ అసోసియేషన్‌ ఫర్‌ ది అడ్వాన్స్‌మెంట్‌ ఆఫ్‌ కలర్డ్‌ పీపుల్స్‌(NAACP) అన్వాల్‌ కన్వేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బైడెన్‌ మాట్లాడుతూ.. కమలా హారీస్‌ కేవలం గొప్ప ఉపాధ్యక్షురాలు మాత్రమే కాదు. ఆమె అమెరికా ప్రెసిడెంట్‌ కూడా కావచ్చు అని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు విన్న డెమోక్రాట్స్‌ ఆనందం వ్యక్తం చపట్లు కొట్టారు. ఇక, బైడెన్‌ వ్యాఖ్యలపై రాజకీయంగా చర్చ మొదలైంది. 

మరోవైపు.. అంతకుముందు కూడా కమలా హారీసే డెమోక్రటిక్‌ పార్టీకి భవిష్యత్‌ అని వైట్‌ హౌస్‌ వర్గాలు తెలిపాయి. ఇక, కొన్ని సందర్భాల్లో మాత్రం బైడెన్‌.. తాను అధ్యక్ష రేసు నుంచి తప్పుకునే ఛాన్స్‌ లేదని చెప్పిన విషయం తెలిసిందే. పోటీలో తానే ఉంటానని చెప్పుకొచ్చారు. ట్రంప్‌ను ఓ‍డిస్తానని వ్యాఖ్యలు కూడా చేశారు. 

ఇదిలా ఉండగా.. ఇటీవల ట్రంప్‌తో భేటీ సందర్భంగా బైడెన్‌ తేలిపోయాలి. దీంతో, బైడెన్‌ అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డెమోక్రటిక్‌ పార్టీలోనే కొందురు నేతలు కామెంట్స్‌ చేశారు. బైడెన్‌ స్థానంలో కమలా హారీస్‌కు అవకాశం ఇవ్వాలని మరికొందరు వ్యాఖ్యలు చేశారు. ఇక, పలు సర్వేల్లో ట్రంప్‌కు పోటీగా కమలా హారీస్‌ బెటర్‌ అనే ఫలితాలు వెలువడిన విషయం తెలిసిందే. సీఎన్‌ఎన్‌ సర్వేల్లో కమలా హారీస్‌కు 45 శాతం ఓట్లు రాగా ట్రంప్‌కు మాత్రం 47 శాతం ఓటింగ్‌ వచ్చింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)