Breaking News

60 గంటల్లో ప్రపంచాన్ని చుట్టి.. ‘నాసా’ కొత్త చీఫ్‌ ఇసాక్‌మన్‌ సక్సెస్‌ స్టోరీ

Published on Sun, 12/08/2024 - 13:51

అగ్రరాజ్యం అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అధికార పీఠం అధిష్టించాక పాలనలో పలు మార్పులు తీసుకువస్తున్నారు. ప్రతిష్టత్మక పదవులలో నూతన నియామకాలు చేపడుతున్నారు. ఈ నేపధ్యంలోనే అధ్యక్షుడు ట్రంప్‌ తాజాగా అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ(నాసా)కు చీఫ్‌గా 41 ఏళ్ల బిలియనీర్ జారెడ్ ఇసాక్‌మన్‌ను నియమించారు.

ఎలాన్ మస్క్‌కు చెందిన కంపెనీ స్పేస్‌ ఎక్స్‌ సాయంతో అంతరిక్షంలోకి మొదటి ప్రైవేట్ ట్రిప్ చేసిన వ్యక్తి ఇసాక్‌మన్‌. 2009లో  ఇసాక్‌మన్‌ 60 గంటల్లో ప్రపంచాన్ని చుట్టి నూతన ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 16 ఏళ్ల వయసులో చదవును విడిచిపెట్టి, నేడు నాసాకు చీఫ్‌గా నియమితులయ్యే వరకూ ఇసాక్‌మన్‌ ప్రయాణం  ఎంతో ఆసక్తికరంగా సాగింది. ఇసాక్‌మన్‌ అమెరికాలో ప్రముఖ వ్యాపారవేత్తగానూ గుర్తింపుపొదారు.

ఇసాక్‌మన్‌ 1983, ఫిబ్రవరి 11న న్యూజెర్సీలో డొనాల్డ్,సాండ్రా మేరీ ఐజాక్‌మన్ దంపతులకు జన్మించారు. నలుగురు తోబుట్టువులలో ఇసాక్‌మన్‌ చిన్నవాడు. ఆయన కిండర్ గార్టెన్ నుండి ఆరవ తరగతి వరకు వెస్ట్‌ఫీల్డ్‌లోని విల్సన్ ఎలిమెంటరీ స్కూల్‌లో చదువుకున్నాడు. ఇసాక్‌మన్‌కు 12 ఏళ్లు ఉన్నప్పుడు అతని కుటుంబం న్యూజెర్సీలోని బెర్నార్డ్స్ టౌన్‌షిప్‌లోని లిబర్టీ కార్నర్ విభాగానికి  షిఫ్ట్‌ అయ్యింది. అక్కడ  ఇసాక్‌మన్‌ విలియం అన్నీన్ మిడిల్ స్కూల్‌లో చదువుకున్నారు.

హైస్కూల్‌లో చదువుతున్న రోజుల్లో ఇసాక్‌మాన్ తన స్నేహితునితో కలిసి తన ఇంటిలో క్రెడిట్ కార్డ్ ప్రాసెసింగ్ కంపెనీ షిఫ్ట్‌ 4ను ప్రారంభించారు.  1999లో ఇసాక్‌మన్‌ పాఠశాల చదువును మధ్యలోనే విడిచిపెట్టారు. అయితే  హైస్కూల్ డిప్లొమాకు సమానమైన జీఈడీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. ప్రస్తుతం కంపెనీ షిఫ్ట్‌ 4 కంపెనీ విలువ దాదాపు 7.4 బిలియన్ డాలర్లు. ఈ కంపెనీ హిల్టన్, కేఎఫ్‌సీ వంటి బ్రాండ్‌లకు చెల్లింపు ప్రాసెసింగ్ చేస్తుంది.

ఇసాక్‌మన్‌ ఎంబ్రీ-రిడిల్ ఏరోనాటికల్ విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెషనల్ ఏరోనాటిక్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని  అందుకున్నారు. 2011లో ఈ డిగ్రీని పొందిన ఇసాక్‌మన్‌కు సైనిక విమానాలను నడిపేందుకు అవసరమైన లైసెన్స్ కూడా ఉంది. అతని దగ్గర  దాదాపు 100 యుద్ధ విమానాలు ఉన్నాయి. అతని కంపెనీ అమెరికా, నాటో దేశాల వైమానిక దళాల ఫైటర్ పైలట్‌లకు శిక్షణ ఇస్తుంది. ఇసాక్‌మన్‌ అమెరికాలో అత్యంత ధనవంతుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. అతని ఆస్తుల నికర విలువ 1.9 అమెరికన్‌ బిలియన్‌ డాలర్లు. 2021లో పొలారిస్ ప్రోగ్రామ్ కింద ఎలాన్ మస్క్ కంపెనీ స్పేస్‌ఎక్స్ సహాయంతో చారిత్రక అంతరిక్ష యాత్ర చేశాడు. ఈ పర్యటన కోసం ఇసాక్‌మన్‌ 200 మిలియన్ డాలర్లు ఖర్చు చేశాడు.

ఇది కూడా చదవండి: భారత్‌తో కుస్తీ.. పాక్‌తో దోస్తీ.. మారిన బంగ్లాదేశ్‌ వైఖరి?

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)