Breaking News

ఆ దేశంలో ఆంగ్లంలో మాట్లాడితే రూ. 82 లక్షలు జరిమానా!

Published on Mon, 04/03/2023 - 11:48

ఆంగ్ల భాష అంతర్జాతీయ భాషగా రాజ్యమేలుతున్న సంగతి తెలుసిందే. ఈ తరుణంలో ఒక దేశం మాత్రం ఆ భాషను ఉపయోగించడానికి వీలు లేదంటూ హుకూం జారీ చేసింది. అందుకోసం ఓ ముసాయిదా బిల్లును కూడా తీసుకొచ్చింది. పొరపాటున కూడా కమ్యూనికేట్‌ చేసేటప్పుడూ ఇంగ్లీష్‌ పదాలు దొర్లినా పెద్ద మొత్తంలో జరిమానా విధిస్తానని కూడా పేర్కొంది.  ఆంగ్ల భాషను పూర్తిగా బ్యాన్‌ చేసిన తొలిదేశం కూడా అదే కాబోలు!.

వివరాల్లో కెళ్తే.. ఇటాలీ ప్రధాన మంత్రి, బ్రదర్స్‌ ఆఫ్‌ ఇటలీ పార్టీ నేత జార్జియా మెలోని ఈ కొత్త ప్రతిపాదిత చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టం ప్రకారం ఏఇటాలియన్‌ అయినా కమ్యూనికేట్‌ చేసేటప్పుడూ .. విదేశీ పదాలను ఉపయోగిస్తే దాదాపు రూ. 82 లక్షల వరకు జరిమానా విధించడం జరుగుతుంది. ఈ బిల్లును ఛాంబర్‌ ఆఫ్‌ డిప్యూటీ సభ్యుడు ఫాభియో రాంపెల్లి ప్రవేశ పెట్టారు. దీనికి ఇటాలియన్‌ ప్రధానమంత్రి జార్జియా మద్దతు ఇచ్చారు. ఆంగ్ల పదాలు లేదా ఆంగోమానియాను లక్ష్యంగా చేసకుని మరీ ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ ముసాయిదా బిల్లు ప్రకారం.. ఈ ఆంగ్ల భాష ఇటాలియన్‌ భాషను కించపరుస్తున్నట్లు పేర్కొంది.

బ్రిటన్‌ నిష్రమణతో బ్రెగ్జిట్‌గా పేరుగాంచిన యూరోపియన్‌ యూనిన్‌ కారణంగా ఆ పరిస్థితి దారుణంగా దిగజారిందని పేర్కొంది. అంతేగాదు ఆ బిల్లు..పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో పదవిని కలిగి ఉన్నవారెవరైనా వ్రాతపూర్వకంనూ, కమ్యూనికేషన్ పరంగానూ ఇటాలియన్‌ భాషపై నైపుణ్యం కలిగి ఉండాలని స్పష్టం చేసింది. ఉద్యోగా స్థానాల్లో, వ్యాపార సంబంధ డాక్యుమెంట్‌లలోనూ, అధికారిక పత్రాలలోనూ కూడా ఆంగ్లంలో పేర్లను వినియోగించడాన్ని పూర్తిగా నిషేధించింది.

ఆఖరికి ఇటాలియన్‌ భాష రాని విదేశీయులతో కమ్యూనికేట్‌ చేసే కార్యాలయ్యాలకు కూడా ఈ నిబంధన వర్తిస్తుందని చెప్పింది. ఆర్టికల్‌ 2 ప్రకారం.. జాతీయ భూభాగంలో ప్రజా వస్తువుల, సేవలు వినియోగం కోసం ఇటాలియన్‌ని ప్రాథమిక భాషగా ఉపయోగించాలిని ఆ ముసాయిదా బిల్లులో స్పష్టం చేసింది. అంతేగాదు దీన్ని అతిక్రమిస్తే రూ. 4 లక్షల నుంచి దాదాపు రూ. 82 లక్షల వరకు జరిమానా విధిస్తాని బిల్లులో పేర్కొంది. అయితే ఈ బిల్లుపై పార్లమెంట్‌లో చర్చలు జరిపిన తదనంతరం పూర్తి స్తాయిలో అమలు చేయనుంది ఇటలీ. 

(చదవండి: లొంగిపోనున్న ట్రంప్‌..ఫుల్‌ బంధోబస్తుకు ప్లాన్‌)

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌