Breaking News

పర్యాటకుల రెస్టారెంట్‌ బిల్లు కట్టిన ఇటలీ ప్రభుత్వం

Published on Mon, 08/21/2023 - 06:23

రోమ్‌: ఇటలీకి చెందిన ముగ్గురు పర్యాటకులు పొరుగుదేశం ఆల్బేనియాకు వెళ్లారు. అక్కడ రెస్టారెంట్‌లో తిని బిల్లు కట్టకుండా చెక్కేశారు. ఇటలీ ప్రధాని మెలోనీ ఇటీవల కుటుంబంతో కలిసి ఆల్బేనియాలో పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా అల్బేనియా ప్రధాని ఈడి రమా ఈ విషయాన్ని ప్రస్తావించారు. దీనిని మెలోనీ తీవ్ర అవమానంగా భావించారు. దేశం పరువు తీశారంటూ తమ దేశస్తులపై మండిపడ్డారు. ‘వెళ్లి ఆ నలుగురు ఇడియట్స్‌ బిల్లు కట్టండి’అంటూ అక్కడి తమ దౌత్యాధికారులను ఆదేశించారు.

వారు వెళ్లి రూ.7,245 బిల్లును సదరు రెస్టారెంట్‌ నిర్వాహకులకు చెల్లించి వచ్చారు. నిబంధనలు, సంప్రదాయాలను పాటించాలని, ఇటువంటివి మరోసారి జరక్కుండా జాగ్రత్తపడాలని తమ దేశస్తులకు ఇటలీ ఎంబసీ సూచించింది. కొందరు వ్యక్తులు బిల్లు చెల్లించకుండానే రెస్టారెంట్‌ నుంచి వెళ్లిపోతున్నట్లుగా సదరు రెస్టారెంట్‌ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అవుతోంది. దీనిపై రెస్టారెంట్‌ యజమాని మాట్లాడుతూ.. ఫుడ్‌ ఐటమ్స్‌ ఎంతో బాగున్నాయంటూ సదరు నలుగురు ఇటాలియన్లు తమను మెచ్చుకున్నారని కూడా తెలపడం విశేషం.

Videos

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు